నాని 'జెర్సీ'కి అంతర్జాతీయ గుర్తింపు.. టోరంటో ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక
క్రికెట్ క్రీడా నేపథ్యంతో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం జెర్సీ ఈ చిత్రం ఘన విజయం సాధించటమే సాధారణ ప్రేక్షకులు, సినీ విమర్శకుల పలు ప్రశంసలు అందుకున్నది. సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన సంగీతం, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి 'జెర్సీ' చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.
జీవితంలో పలు అంశాల్లో ఓటమిపాలై డిప్రెషన్‌కు గురైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని మళ్లీ ఎలా గెలుపు సాధించాడనే కథతో తెరకెక్కిన 'జెర్సీ' చిత్రానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ చిత్రం భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు 'జెర్సీ' ఎంపికైంది.

ఈ ఏడాదిలోనే ఆగస్టు 9 నుంచి, 15 వరకు టోరంటోలో జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబడుతుది. ఈ విషయాన్ని మీడియాతో పంచుకోవటం తమ కెంతో సంతోషాన్ని కలిగిస్తోందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరో 'షాహిద్ కపూర్' తో ఈ 'జెర్సీ' చిత్రం బాలీవుడ్ లో నిర్మితం కానున్న విషయం విదితమే.

నటీనటులు: నాని, శ్రద్దా శ్రీనాథ్, సత్యరాజ్, రోహిత్ కమ్రా, హరీష్ కల్యాణ్, విశ్వంత్, సంపత్ రాజ్, ప్రవీణ్ తదితరులు
రచన, దర్శకుడు: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
సినిమాటోగ్రఫర్: సాను జాన్ వర్గీస్
మ్యూజిక్ం అనిరుధ్ రవిచందర్
ఎడిటర్: నవీన్ నూలి
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్


Click it and Unblock the Notifications











