నాని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. V సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్
నాచురల్ స్టార్ నాని హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి V అనే ఆసక్తికర టైటిల్ అనౌన్స్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తుండగా, నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. 'V' విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఉగాది కానుకగా వచ్చే ఏడాది మార్చి 25న 'V' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లుగా ప్రకటించారు. ఈ పోస్టర్ షేర్ చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి.. "ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు" అన్నాడు విలియమ్ షేక్ స్పియరుడు. ఆల్ ఎనిమీస్... బివేర్.. వచ్చే ఉగాది నుంచి ఆట, వేట మొదలు అని పేర్కొన్నారు.

నాని కెరీర్ లో 25వ సినిమాగా రాబోతున్న V సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్,లక్ష్మణ్,హర్షిత్ నిర్మాతలుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రానికి సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వైవిధ్యమైన కథాంశాలతో ముందుకెళ్తున్న నాని మొదటిసారి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్‌గా కనిపించనుండటం విశేషం. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా విలన్ సెంట్రిక్ మూవీ అని క్లియర్‌గా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











