నేచురల్ స్టార్ నాని నోట శుభవార్త.. అభిమానుల సంబరాలు!
వరుస విజయాల దూసుకెళ్లున్న నేచురల్ స్టార్ నాని అభిమానులను శుభవార్త చెప్పారు. దేవదాస్ తర్వాత సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తన జెర్సీ సినిమా రిలీజ్ గురించి కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున ట్విట్టర్‌లో అప్‌డేట్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు.
దేవదాస్ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం జెర్సీ. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్‌ను నాని అధికారికంగా ప్రకటించారు.

19-04-19 రోజున అంటే 2019 ఏప్రిల్ 19వ తేదీన జెర్సీ సినిమా రిలీజ్ అవుతున్నది. రాబోయే వేసవి ఆనందకరంగా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను. జెర్సీ అంటూ ట్యాగ్ చేశారు.
పూర్తిస్థాయి క్రికెట్ క్రీడా నేపథ్యంగా జెర్సీ సినిమా రూపొందుతున్నది. ఈ సినిమా కోసం నాని ప్రత్యేకంగా క్రికెట్ శిక్షణ పొందారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: నాని, సత్యరాజ్, శ్రద్ధా శ్రీనాథ్, బ్రహ్మాజీ, రోనిత్ కమ్రా తదితరులు
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫి: సాన్ జాన్ వర్గీస్
ఎడిటింగ్: నవీన్ నూలి
రిలీజ్ డేట్: 2019-04-19


Click it and Unblock the Notifications











