శ్యామ్ సింగ రాయ్ నుంచి డిలీటైన సీన్ రిలీజ్.. ఇదెందుకు తీసేశారబ్బా!

అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా మారాడు నాని. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన అతడు.. ఎన్నో విజయాలను అందుకున్నాడు. తద్వారా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే, ఆ మధ్య 'జెర్సీ'తో భారీ హిట్‌ను అందుకున్న నాని.. ఆ తర్వాత అలాంటి విజయం కోసం చాలా ప్రయత్నాలే చేశాడు. ఇందులో భాగంగానే 'గ్యాంగ్ లీడర్', 'V', 'టక్ జగదీష్' వంటి మూవీలను చేశాడు. కానీ, ఇవేమీ అతడికి కావాల్సిన భారీ సక్సెస్‌ను మాత్రం అందించలేకపోయాయి.

ఈ సారి గట్టిగా కొట్టాలన్న పట్టుదలతో నాని 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యన్ వైవిధ్యమైన కథతో తెరకెక్కించాడు. ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీనికితోడు ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరించారు. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగానే దక్కాయి. మొత్తంగా ఈ మూవీ రన్ క్లోజ్ అయ్యే సరికి దీనికి రూ. 4 కోట్ల వరకూ లాభాలు వచ్చాయి. దీంతో నాని కెరీర్‌లో మరో హిట్ వచ్చి చేరినట్లైంది.

Nanis Shyam Singha Roy Deleted Scene Released

'శ్యామ్ సింగ రాయ్' మూవీ సూపర్ హిట్ అవడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దీని నుంచి పోస్ట్ ట్రైలర్‌ను ఆ మధ్య విడుదల చేశారు. ఆ తర్వాత కూడా పలు వీడియోలను రిలీజ్ చేశారు. ఇక, కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి తీసేసిన సన్నివేశాలను వదులుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో దానిని విడుదల చేశారు. వాసు మూడు సినిమాల అగ్రిమెంట్ వీడియో అంటూ వదిలిన ఇందులో.. హీరో నానితో ముంబైకు చెందిన బడా నిర్మాణ సంస్థ మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని చూపించారు. ఇది చూసిన వాళ్లంతా సినిమాలో ఎందుకు తీసేశారా అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అదే సమయంలో ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక, థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలోనూ దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో చేరింది. అంతేకాదు, ప్రపంచంలోనే ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల (నాన్ ఇంగ్లీష్) జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఇండియా నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇక, నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్‌లో రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X