నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'.. బర్త్ డే గిఫ్టుగా ఫస్ట్‌లుక్
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో వేగం పెంచారు. ఓ వైపు తాను నటించిన వీ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. సెట్స్‌పైకి టక్ జగదీష్‌ను తీసుకెళ్లాడు. ఇలా జంట ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నాని శ్యామ్ సింగరాయ్ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని జెర్సీ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్నారు. 'టాక్సీ వాలా' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.
నాని జన్మదినం ఫిబ్రవరి 24వ సందర్భంగా శ్యామ్ సింగ రాయ్ అనే పేరును నిర్ణయించినట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రచార చిత్రం వీడియోను తమ అధికారిక సామాజిక మాధ్యమం యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో 2020 డిసెంబర్ 25 న చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు.

ఇక హీరో నానికి తన కెరీర్‌లో శ్యామ్ సింగరాజ్ 27 వ చిత్రం. చిత్రం ప్రారంభం, చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ పి.డి.వి.ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ.


Click it and Unblock the Notifications











