నాని కూడా మొదలెట్టేశాడు.. బ్యాక్ టు యాక్షన్!

నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమాలో నటించారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసివేత గురించి ముందే ఊహించిన సినిమా యూనిట్ సినిమాని వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం త్వరలో ప్రకటిస్తామని కూడా నాని వాయిదా ప్రకటనలో చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాతో పాటు ఆయన శ్యామ్ సింగరాయ్ అనే సినిమా కూడా చేస్తున్నారు. పూర్తిగా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో జరిపారు. అయితే అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్కు అంతరాయం కలగడంతో యూనిట్ అంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్లపాటు గోదావరి జిల్లాల్లో జరిగింది. గోదావరి నది ఒడ్డున ఈ సినిమా షూటింగ్ జరగగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్లో జరుగుతోంది.

nanis Shyam Singha Roy Last schedule begins in hyderabad

ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా ఆరున్నర కోట్ల రూపాయలు పెట్టి కలకత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను స్పురించేలా సెట్ నిర్మించారు. అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని సినిమాల షూటింగులు ఆపేశారు. అయితే అప్పుడు నాని సినిమా నిర్మాత ఇబ్బంది పడకూడదని షూటింగులో చాలా రోజులు పాల్గొనగా ఎట్టకేలకు ఆపేశారు. ఇప్పుడు కరోన కుదుట పడడంతో మళ్ళీ ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ విషయాన్ని నాని స్వయంగా సోషల్ మీడియా వేదికాగా ప్రకటించారు. ఈ సినిమా నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా. విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా అనే సినిమా తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X