నాలుగు భాషల్లో శ్యామ్ సింగరాయ్.. వారం గ్యాప్ లోనే అంటే మామూలుగా లేదుగా!
చివరిగా నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసివేత గురించి ముందే ఊహించిన సినిమా యూనిట్ సినిమాని వాయిదా వేసింది. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఆ తరువాత ఇప్పుడు ఆయన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఇక్కడే
పూర్తిగా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో జరిపారు. అయితే అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్కు అంతరాయం కలగడంతో యూనిట్ అంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్లపాటు గోదావరి జిల్లాలో జరిగింది. గోదావరి నది ఒడ్డున ఈ సినిమా షూటింగ్ జరగగా ఆ తరువాత ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ లో జరిగింది.

సెట్ నిర్మించి
ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా ఆరున్నర కోట్ల రూపాయలు పెట్టి కలకత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను స్పురించేలా సెట్ నిర్మించారు. అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని సినిమాల షూటింగులు ఆపేశారు. అయితే అప్పుడు నాని సినిమా నిర్మాత ఇబ్బంది పడకూడదని షూటింగులో చాలా రోజులు పాల్గొనగా కేసులు నమోదు కావడంతో ఆపేశారు.

నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా
ఇక అలా కరోనా కుదుట పడిన వెంటనే షూట్ మొదలు పెట్టి పూర్తి చేసారు. ఈ సినిమా నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా కాగా విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా అనే సినిమా తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు.

అల్లు అర్జున్ పుష్ప
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నాని తాజాగా ఈ సినిమా థియేటర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుందని నాని పేర్కొన్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే డిసెంబర్ 17న అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమా పుష్ప విడుదలవుతోంది. అంటే ఓ వారం గ్యాప్ లో రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే ఇదే నెలలో బాలకృష్ణ అఖండ కూడా విడుదల కానుందని అంటున్నారు.
Recommended Video

పుష్ప విడుదలైన వారానికే
శ్యామ్ సింగ రాయ్‌లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఆయన ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. జిష్షు సేన్ గుప్తా నితిన్ భీష్మ, నాగ శౌర్య అశ్వద్ధామ, మాస్ట్రో సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక అదే రోజున బాలీవుడ్ 83 సినిమా విడుదల అవుతోంది. నానికి ఎలాగో అక్కడ మార్కెట్ లేకపోవడంతో పెద్దగా టెన్షన్ లేదనే చెప్పాలి. అయితే పుష్ప విడుదలైన వారానికే విడుదల చేస్తున్నారంటే సినిమా మీద భీభత్సమైన నమ్మకం ఉండే ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











