శ్యామ్ సింగరాయ్ ట్రైలర్: కృతితో లిప్ లాక్స్.. సాయి పల్లవితో అలా.. అంచనాలు పెంచేస్తోందిగా!

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఆ వివరాలు

Recommended Video

Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
 శ్యామ్ సింగరాయ్

శ్యామ్ సింగరాయ్

చివరిగా నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసివేత గురించి ముందే ఊహించిన సినిమా యూనిట్ సినిమాని వాయిదా వేసింది. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఆ తరువాత ఇప్పుడు ఆయన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

డిసెంబర్ 24న

డిసెంబర్ 24న

ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే డిసెంబర్ 17న అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమా పుష్ప విడుదలవుతోంది. అంటే ఓ వారం గ్యాప్ లో రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

పుష్ప విడుదలైన వారానికే

పుష్ప విడుదలైన వారానికే

శ్యామ్ సింగ రాయ్‌లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా, మడోన్నా సెబాస్టియన్ లాంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సత్యదేవ్ జంగా ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించారనే విషయాన్ని సినీ వర్గాలు, చిత్ర యూనిట్ ప్రస్తావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం నాడు ట్రైలర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకుంటున్న కుర్రాడికి.. శ్యామ్ సింగరాయ్‏కు గల అనుబంధం ఏంటి అనేది ఈ ట్రైలర్‏లో చూపించారు.

 కృతితో లిప్ లాక్స్

కృతితో లిప్ లాక్స్

శ్యామ్ సింగరాయ్ గా ''పిరికివాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడతారు.. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమం గొప్పది కాదు... తప్పని తెలిసాక.. దేవుడ్ని కూడా ఏదిరించడంలో'' తప్పు లేదు అని నాని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద ట్రైలర్ లో నాని డబుల్ రోల్ అదిరి పోయింది. వాడి గుడిసె జోలికి వెళ్లావో.. నీ ఇళ్లు ఎక్కడుందో నాకు బాగా తెలుసు అంటూ నాని చెప్పే డైలాగ్ మాస్ యాంగిల్ ను కూడా ఎలివేట్ చేస్తుంది. ఇక ఈ పాత్రలో రొమాన్స్ కూడా అదరగొట్టేశాడు నాని. కృతితో లిప్ లాక్స్, దేవదాసి సాయి పల్లవితో కెమిస్ట్రీ ఆసక్తి రేకెత్తిస్తోంది.

మంచి హిట్ అందించేలా

మంచి హిట్ అందించేలా

నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో పిరియాడిక్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం వరంగల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. ఇందులో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నానికి ఈ సినిమా మంచి హిట్ అందించేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X