నానీ టక్ జగదీష్ బిజినెస్‌పై గ్యాంగ్ లీడర్ దెబ్బ.. మూవీ ఓవర్సీస్ బిజినెస్ ఎంతంటే
నేచురల్ స్టార్ నానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో సందడి చేస్తున్నాడు. ఓ వైపు V మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని.. మరో సినిమాను కూడా ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వీ సినిమా అనంతరం టక్ జగదీష్ అనే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. గతవారమే టక్ జగదీష్ సినిమా షూటింగ్‌ను ఆరంభించి శరవేగంగా ముందుకెళ్తున్నాడు. ఈ చిత్రానికి నిన్ను కోరి, మజిలీ లాంటి సక్సెస్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఓవర్సీస్ బిజినెస్ జరగడం ట్రేడ్ సర్కిల్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను రూ.4 కోట్లకుపైగా చెల్లించి సొంతం చేసుకొన్నట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను వీకెండ్ సినిమా, 7 ఆర్ట్స్ సినిమాస్ కొనుగోలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్.

నాని గత చిత్రంతో పోల్చుకొంటే టక్ జగదీష్ సినిమాకు అంతగా బిజినెస్ కాకపోవడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇటీవల రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ రూ.5.5 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే ఓవర్సీస్‌లో ఆ ప్రాజెక్ట్ నష్టాలతో ముగిసింది. దాంతో టక్ జగదీష్ అంతకంటే తక్కువకే బిజినెస్ జరిగిందనే ట్రేడ్ వర్గాల రిపోర్ట్. టక్ జగదీష్‌తో హిట్ కొట్టి మళ్లీ బిజినెస్ పరంగా ముందుకెళ్లే ప్రయత్నంలో నాని ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇక మార్చి 25వ తేదీన రిలీజ్ కానున్న వీ చిత్రంలో నాని విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని ప్రతి నాయకుడి పాత్రలో తొలిసారి కనిపించబోతున్నాడు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది.


Click it and Unblock the Notifications











