twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి కొడుకు గెటప్‌లో షాకిచ్చిన నాని: పండుగను ముందే తీసుకొచ్చాడుగా!

    |

    స్వయంకృషితో సినిమా రంగంలోకి ప్రవేశించి.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని. సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చేసిన అతడు.. తన కెరీర్‌లో అన్ని జోనర్లనూ టచ్ చేశాడు. గతంలో ఓ మోస్తరు బడ్జెట్‌తో సినిమాలు చేసిన అతడు.. మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని ఇటీవలి కాలంలో భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు 'టక్ జగదీష్' అనే మూవీలో నటిస్తున్నాడు.

    'నిన్ను కోరి' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'టక్ జగదీష్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ను వారం రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇందులో నేచురల్ స్టార్ నానిని పెళ్లి కొడుకును చేస్తున్నారు. ఈ పోస్టర్‌లో జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, రోహిణి సహా ఎంతో మంది నటీనటులు కనిపిస్తున్నారు. '2021 ఏప్రిల్‌లో బాక్సాఫీస్‌ను స్టక్ చేయబోతున్నాం' అని ఇది వరకే సినిమా రిలీజ్‌పై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగానే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

    Nanis Tuck Jagadish Special Poster Released

    షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. నాని కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమాతో పాటే నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే.. సుందరానికీ' అనే సినిమాతో పాటు 'ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో 'శ్యామ్ సింగరాయ్' అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు కూడా అధికారికంగా ప్రారంభం అయిపోయాయి.

    English summary
    Tuck Jagadish is a romantic family entertainer movie directed by Ninnu Kori and Majili fame Shiva Nirvana and produced by Sahu Garapati and Harish Peddi. The movie cast includes Nani, Ritu Varma and Aishwarya Rajesh are played the main lead roles while Thaman S scored music. Read: Complete Tuck Jagadish Story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X