twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరుదైన ఘనతను అందుకున్న ‘టక్ జగదీష్’: నాని కెరీర్‌లోనే భారీ రెస్పాన్స్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో చాలా తక్కువ మంది మాత్రమే సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఏకంగా మూడు సినిమాలను చేస్తున్నాడు. అందులో కుటుంబ కథా చిత్రంగా రాబోతున్న 'టక్ జగదీష్' ఒకటి. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

    నేచురల్ స్టార్ నాని హీరోగా.. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన శివ నిర్వాణ రూపొందిస్తోన్న చిత్రమే 'టక్ జగదీష్'. ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన 'నిన్ను కోరి' వంటి హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇటీవల విడుదల ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా నేటికి ఇది 16 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇందులో యూట్యూబ్‌లో 11 మిలియన్లు, మిగిలినవి సోషల్ మీడియా ద్వారా వచ్చాయి. ఇది నాని కెరీర్‌లోనే వేగంగా వచ్చిన బిగ్గెస్ట్ మార్క్ వ్యూస్ అనే టాక్ వినిపిస్తోంది.

    Nanis Tuck Jagadish Teaser Reach 16M Views

    'టక్ జగదీష్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ విడుదల కూడా కరోనా వల్ల ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే దీనికి ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని, దానికి నాని నిరాకరించాడని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    Tuck Jagadish is a romantic family entertainer movie directed by Ninnu Kori and Majili fame Shiva Nirvana and produced by Sahu Garapati and Harish Peddi. The movie cast includes Nani, Ritu Varma and Aishwarya Rajesh are played the main lead roles while Thaman S scored music. Read: Complete Tuck Jagadish Story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X