నాని V ఫస్ట్‌లుక్: నిన్న అలా.. నేడు ఇలా!! సినిమాపై అంచనాలు పెంచేస్తున్న పోస్టర్స్

నాచురల్ స్టార్ నాని హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న విలక్షణ కథాంశం V. సింగల్ అక్షరంలో ఇలా ఆసక్తికర టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. పైగా నాని కెరీర్‌లో ఇది ఓ డిఫెరెంట్ మూవీగా రానుందని వచ్చిన వార్తలు సినిమా పట్ల ఆతృతను పెంచేశాయి. కాగా తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్ రిలీజ్ చేసి ఆ ఆతృతను రెక్కలు కట్టారు మేకర్స్.

 శరవేగంగా షూటింగ్.. నాని రోల్

శరవేగంగా షూటింగ్.. నాని రోల్

గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తుండగా.. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రంలో నాని రోల్ కోసం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ నాని రోల్ ఎలా ఉండనుందనేది చెప్పకనే చెప్పేసింది.

మెలితిరిగిన మీసాలు.. చేతిలో కత్తెర

మెలితిరిగిన మీసాలు.. చేతిలో కత్తెర

ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో గుబురు గడ్డం, మెలితిరిగిన మీసాలతో కలిపిస్తున్న నాని చేతిలో చిన్న కత్తెర పట్టుకున్నాడు. చాలా సీరియస్‌గా నాని లుక్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో నానిని చూడొచ్చని స్పష్టంగా తెలుస్తోంది.

తప్పు జరిగితే యముడొస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం

తప్పు జరిగితే యముడొస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం

ఇక ఈ చిత్రంలో రక్షకుడి పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. నిన్న (జనవరి 27) సుధీర్ బాబు ఫస్ట్‌లుక్ రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో గన్ పట్టుకుని టెరిఫిక్ గా ఉన్న సుధీర్ బాబు లుక్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. "తప్పు జరిగితే యముడొస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం" అంటూ సుధీర్ బాబు క్యారెక్టర్ డిఫైన్ చేయగలిగే లైన్‌తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

Recommended Video

HIT Movie Opening Ceremony || Nani || Vishwak Sen ||
నాని 25.. భారీ అంచనాలు

నాని 25.. భారీ అంచనాలు

నాని కెరీర్‌లో 25వ సినిమాగా V మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిస్తున్నారు. శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి ''సైరా'' ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వైవిధ్యమైన కథాంశాలతో ముందుకెళ్తున్న నాని మొదటిసారి ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X