V టీజర్ అప్‌డేట్: రెడీగా ఉండండి.. ఫిక్స్ చేసేశారు

మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న విలక్షణ కథాంశం V. సింగల్ అక్షరంలో ఇలా ఆసక్తికర టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. పైగా నాని కెరీర్‌లో ఇది ఓ డిఫెరెంట్ మూవీగా రానుందని వచ్చిన వార్తలు సినిమా పట్ల ఆతృతను పెంచేశాయి. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల్లో ఉన్న ఆతృతకు రెక్కలు కట్టాయి.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజా V టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ న్యూ పోస్టర్ వదిలింది చిత్రయూనిట్. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుందని తెలిపారు. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తుండగా.. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Nanis V Teaser Release date fix

నాని కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న V మార్చి 25న విడుదల కానుంది. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి ''సైరా'' ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వైవిధ్యమైన కథాంశాలతో ముందుకెళ్తున్న నాని మొదటిసారి ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X