Hit 3 : నాని హిట్ 3కి సెన్సార్ బోర్డు షాక్.. రిలీజ్ కు ముందే రచ్చ

నేచురల్ స్టార్ నాని త్వరలో హిట్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చివరిగా సరిపోదా శనివారం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. శ్యాం సింగరాయ్ చిత్రం నుంచి నాని నుంచి వస్తున్న సినిమాలు మోస్ట్ వైలెంటెడ్ గా ఉంటున్నాయి. సరిపోదా శనివారానికి ముందు నాని నటించిన దసరా చిత్రం ఏ రేంజ్ లో మాస్ ఆడియన్స్ ను మెప్పించిందో చూశాం. సినిమాతో నాని తన కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమాను సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలో ఇక నాని యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రియారిటి ఇస్తున్నారు. దసరా తర్వాత వచ్చిన సరిపోదా శనివారం చిత్రంలోను యాక్షన్ తో అదరగొట్టారు. ప్రస్తుతం నాని నుంచి హిట్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మే 1న గ్రాండ్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వద్ద బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా మూడు వారాలు మిగిలి ఉండగానే ముందుగానే సినిమాను సెన్సార్ చేయించడానికి టీం వెళ్లిందని తెలుస్తోంది.

Nani Sailesh Kolanu Hit 3 Movie for Censor Cuts

సెన్సార్ బోర్డులో నాని, శైలేష్ కొలను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హిట్టు 3 చిత్రాన్ని తాజాగా ప్రదర్శించినట్టు సమాచారం. అయితే ఏ సినిమా అయినా రిలీజ్ కు వారం రోజుల ముందు సెన్సార్ బోర్డు అనుమతికి వెళ్తుంది. అక్కడ బోర్డు సభ్యులు సినిమాను చూసిన తర్వాత సర్టిఫికెట్లను జారీ చేస్తూ ఉంటారు. కానీ హిట్ 3 సినిమా రిలీజ్ కి మూడు వారాల ముందే సెన్సార్ అనుమతి కోసం వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రంలో భారీ వైలెన్స్ ఉండడం కారణంగానే ముందుగా సెన్సార్ బోర్డు అనుమతికి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ వణుకు పుట్టించేలా ఉంది. నాని ఊచకోతతో ఇప్పటివరకు తెలుగు సినిమాలలో చూడని విధంగా వైలెన్స్ చూపించబోతున్నారని అర్థమవుతుంది. పలువురు సినిమా నిపుణుల అభిప్రాయాల మేరకు మితిమీరిన వైలెన్స్ ఉంటే సినిమా రిలీజ్ కు ఇబ్బంది అవుతుందని ముందుగానే సెన్సార్ కి వెళ్లారు. అక్కడ సినిమా ప్రదర్శితం అయిన తర్వాత బోర్డు సభ్యులు చిత్ర యూనిట్ తో గంటపాటు సమావేశ నిర్వహించారంట. సినిమాలో వైలెన్స్ ని ప్రోత్సహించే సన్నివేశాలను ఎక్కడెక్కడ ఎలా తొలగించాలో, ఏ ఏ ఫుటేజ్ ని బ్లర్ చేయాలో సూచించారంట.

శైలేష్ కొలను, నాని దెబ్బకు సినిమాలో చాలావరకు కట్స్ ఉంటాయని తెలుస్తోంది. మిగిలిన టైం లో సెన్సార్ అభ్యంతరం చెప్పిన సీన్లను మార్చి సర్టిఫికెట్ పొందిన తర్వాత ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిట్ 3ని నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మించారు. జమ్ము కాశ్మీర్లో దాదాపు షూటింగ్ జరిగింది. శ్రీనిధి శెట్టి నాని సరసన నటిస్తోంది. రావు రమేష్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళ స్టార్ కార్తీ కామియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు విశేషం.

More from Filmibeat

Read more about: nani sailesh kolanu hit 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X