twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్ : బాల్కనీలో ఏం జరుగుతుందో బయటపెట్టిన నాని.. వీడియో వైరల్

    |

    కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా.. వేలమందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. భారతదేశంలోనూ శరవేగంగా దూసుకుపోతోన్న కరోనా.. ఇప్పటికి మూడు వందల మందిని కరోనా బారిన పడ్డారు. ఇంతలా ప్రభావాన్ని చూపుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశం మొత్తం నేడు (మార్చి 22) జనతా కర్ఫ్యూను పాటిస్తోంది.

     కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ..

    కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ..


    కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకుతుండటంతో ఈ గొలుసును అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చాడు. నేటి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వీయ నిర్భందం విధించుకోవాలని ప్రధాని సందేశమిచ్చాడు. వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలే కావడంతో.. పద్నాలుగు గంటలు ఇంటి పట్టునే ఉంటే.. కరోనాను నియంత్రించే అవకాశం ఉందని దేశ ప్రజలకు సూచించాడు.

    నడుంబిగించిన తారాలోకం..

    నడుంబిగించిన తారాలోకం..

    జనతా కర్ఫ్యూపై అవగాహన కల్గించేందుకు సెలెబ్రిటీలందరూ ముందుకు వచ్చారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలంతా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. అమితాబ్, ఆమీర్, సల్మాన్, అక్షయ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలు జనతా కర్ఫ్యూపై ప్రజలకు అవగాహన కల్పించి.. బాధ్యతగా మెలగాలని సూచించారు.

    దర్శనమిస్తోన్న ఖాళీ రోడ్లు..

    జనతా కర్ఫ్యూలో భాగంగా రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ఒక్కటంటే ఒక్క వాహనం కూడా రోడ్డుపై కనిపించడం లేదు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు జనమంతా స్వచ్చందంగా ఇంట్లోనే నిర్భందం విధించుకున్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న ప్రదేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

    వీడియో షేర్ చేసిన నాని..

    వీడియో షేర్ చేసిన నాని..

    న్యాచురల్ స్టార్ నాని సైతం స్వీయ నిర్భందంలో ఉండగా.. జనతా కర్ఫ్యూకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. అంతా ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇన్ని రోజులు కాలుష్యం, శబ్దాల వల్ల కొత్త విషయాలు తెలుస్తున్నాయని, తన బాల్కనీలోని మొక్కల చాటులో ఉన్న పిట్టలను, గూడును చూపించాడు.

    English summary
    Nani Is In Self Quarntine. He Shared Video In Janta Curfew. Janta Curfew Become Success
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X