టక్ జగదీశ్.. నాని, శివనిర్వాణ ఇలా ఫిక్సయ్యారేంటి?

ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమా పేర్లు మరీ డిఫరెంట్‌గా ఉంటున్నాయి. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఇలాంటి డిఫరెంట్ పేర్లు పెట్టేస్తూ టైటిల్ తోనే పడేస్తున్నారు మేకర్స్. వైవిధ్యమైన టైటిల్ విన్నపుడు ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆలోచన వచ్చేస్తుంది. సరిగ్గా దాన్నే క్యాచ్ చేస్తూ వస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే నాచురల్ స్టార్ నాని తాజా సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు.

నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇదే కాంబినేషన్ 'నిన్నుకోరి' సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందింది. అదేబాటలో మళ్ళీ రెండో సినిమాతో పలకరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం శివ నిర్వాణ ఓ ఆసక్తికరమైన స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఈ నేపథ్యంలోనే తన స్క్రిప్ట్‌కి యాప్ట్ అయ్యేలా 'టక్ జగదీశ్' అనే టైటిల్ ఫిక్స్ చేశాడు శివ.

Nani- Shiva Nirvana New movie title Fixed

తాజాగా ఈ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి నాని అభిమానుల్లో ఆతృత పెంచేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించనున్నారు. థమన్ సంగీతం సమకార్చున్నారు. ఈ సినిమాను 2020 జనవరిలో సెట్స్ పైకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి టైటిల్ తోనే సగం క్రెడిట్ కొట్టేసింది 'టక్ జగదీశ్' యూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X