Hai Nanna: హాయ్ "నాన్న"పై అల్లు అర్హ నాన్న స్పెషల్ రీవ్యూ.. అదిరిపోయే రిప్లై ఇచ్చన నాని... ఎవరేమన్నారంటే?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తాజాగా వచ్చిన చిత్రం హాయ్ నాన్న. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫీల్ గుడ్ మూవీతో వచ్చిన నాని బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్నాడు. దసరా సినిమా హిట్టు అవడంతో అదే ఊపులో మరో సరికొత్త కథతో వచ్చిన నాని ఈసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం హిట్టు మాత్రమే కాదండోయ్.. అనేక మంది స్టార్ సెలబ్రిటీలు కూడా ఈయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా బాగుందని, యాక్టింగ్ అదిరిపోయిందంటూ వివరిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ నాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. అయితే అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ హీరో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చూశారు. ఈ విషయాన్ని ఆయనే నేరుగా ట్విట్టర్ వేధికగా వెల్లడించారు. సినిమా చాలా బాగుందంటూ రీవ్యూ కూడా రాసుకొచ్చారు. దీనికి నేచురల్ స్టార్ నాని కూడా చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చారు. అయితే వీరిద్దరూ ఈ సినిమాపై ఏం కామెంట్లు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హాయ్ నాన్న మూవీ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్... వాట్ స్వీట్ ఫిల్మ్ అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా ఈ సినిమా తన హృదయాన్ని తాకిందని... నాని యాక్టింగ్ కూడా అదిరిపోయిందని అన్నాడు. అలాగే గ్లీన్ లైటింగ్ అదిరిపోయే స్క్రిప్టును అంతకు మించి వెలిగిపోయే సినిమా మలచడం మరింత బాగుందని చెప్పుకచ్చారు. ఇక మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ... మీ స్వీట్ నెస్ మొత్తం స్క్రీన్ అంతా నిండిపోయిందని అన్నారు. బేబీ కియారా తన డార్లింగ్ అయిపోయిందని చప్పారు. తన క్యూట్ నెస్ తో అందరి మనసులు కరిగించేస్తున్నావు అంటూ ఆమెకు చెబుతూనే స్కూల్ కు వెళ్లంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.

ఈ సినిమా కోసం పని చేసిన వారందరూ తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారంటూ అల్లు అర్జన్ హాయ్ నాన్న మూవీ టీంను పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా కెమెరామాన్ వర్గీస్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్, డైరెక్టర్ శౌర్యువ్ లకు కంగ్రాట్స్ అంటూ ట్విట్టర్ వేధికగా రాసుకొచ్చారు. అద్భుతమైన సినిమా... అందరి మనసుల్ని తాకుందని.. శౌర్యువ్ ప్రెజంటేషన్ అదిరిపోయిందని వెల్లడించారు. ఇక చివరగా హాయ్ నాన్న సినిమా కేవలం నాన్నలను మాత్రమే కాదు.. ప్రతీ కుటుంబ సభ్యుడి హృదయాన్ని తాకుతుందని చెప్పుకొచ్చాడు.
అల్లు అర్జున్ చేసిన ఈ రీవ్యూ చూసిన నాని తనదైన స్టైల్ లో స్పందించాడు. అర్హ నాన్న అప్రూవ్స్ అంటూ రిట్వీట్ చేశాడు. అలాగే ప్రియమైన బన్నీకి చాలా థాంక్స్ అని చెప్పి.. మంచి సినిమా కోసం మీరు ఎల్లప్పుడూ ఉంటారంటూ రెడ్ కలర్ హార్ట్ సింబల్ ను షేర్ చేశారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ రీవ్యూతో పాటు నాని చేసిన ఈ కామెంట్లు నెట్టించ వైరల్ గా మారాయి. మీరూ ఓసారి వీరి ట్విట్టర్ లను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











