SSMB29 చూడకండి.. రాజమౌళి ముందే నాని షాకింగ్ కామెంట్స్
నేచురల్ స్టార్ నాని తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన రాబోయే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన పెద్ద ఈవెంట్ లో నాని ఎస్ఎస్ రాజమౌళి చిత్రకీరిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ SSSMB29పై ఆశ్చర్యకరంగా మాట్లాడారు. అయితే.. నాని చివరిగా 'సరిపోదా శనివారం' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక నెక్ట్స్ హిట్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సిరీస్ కోసం అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నానిని ఫుల్ యాక్షన్ మోడ్ లో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రేక్షకులను మెప్పించేలానే సినిమా ఉంటుందని నాని కూడా హామీనిస్తున్నారు.
ప్రస్తుతం Hit : The Third Case చిత్ర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కాబోతుండటంతో ఇండియాలోని అన్నీ ఏరియాల్లో చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. మే1న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విడుదలకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, మన జక్కన్న ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకు టీమ్ ఘన స్వాగతం పలికింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఎస్ఎస్ రాజమౌళి నాని గురించి గొప్పగా మాట్లాడారు. సినిమా సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంటూ వెళ్తున్నారని అభినందించారు. హిట్ 3 కూడా పెద్ద సక్సెస్ అవుతుందని ఆకాంక్షించారు. దర్శకుడు శైలేష్ కొలనును కూడా అభినందించారు. నాని తన కెరీయర్ లో నేను ఊహించిన స్థాయి కంటే ఇంకా ఎదిగిపోయాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. నాని కూడా తన ప్రసంగంతో ఎస్ఎస్ రాజమౌళిపై గొప్పలు చెప్పారు. రాజమౌళితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. ఇక తన ప్రతి సినిమాకు ఫస్ట్ రివ్యూ రాజమౌళి కుటుంబం నుంచే వస్తుందని, కొన్నాళ్లుగా అది మిస్ అవుతున్నానని చెప్పారు.
ఇక ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ 3 చూసి ఫస్ట్ రివ్యూ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు... అలాగే తన అభిమానులతో మాట్లాడుతూ ఎస్ఎస్ఎంబీ29 గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కోర్టు సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ప్రియదర్శి నటించిన కోర్టు సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమాను చూడకండి అని ఫ్యాన్స్, ఆడియెన్స్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక ఇప్పుడు అదే డైలాగ్ ను రిపీట్ చేస్తూ నా హిట్ 3 సినిమా నచ్చకపోతే SSMB29 చూడకండి అంటూ రాజమౌళి ముందే సాహసోపేతమైన వ్యాఖ్యలు చేశారు.
నాని షాకింగ్ కామెంట్స్ తో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వెంటనే తన మాటలను సరిచేసుకున్నాడు. ఎస్ఎస్ఎంబీ29 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా వద్దన్నా ప్రపంచం మొత్తం చూస్తుందని చెప్పుకొచ్చారు. నాని ఫన్నీ కామెంట్స్ ఈవెంట్ లో ఆసక్తికరంగా మారాయి. రాజమౌళి గారు ఎంత బిజీగా ఉన్నా.. షూట్ మధ్యలో నుంచి తనకోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారని ధన్యవాదాలు చెప్పారు. ఇక హిట్ 3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











