Shyam Singha Roy: నాని సినిమాకు ఆ సర్టిఫికెట్.. మొత్తం రన్ టైం ఎంతంటే!

స్వయంకృషితోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి సహజ సిద్ధమైన నటనతో నేచురల్ స్టార్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నాని. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో విజయాలను అందుకుంటూ వచ్చిన అతడు.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని అతడు.. ప్రతి సినిమాలోనూ సహజ సిద్ధమైన నటనను కనబరిచే అతడు.. అన్నింటినీ వన్ మ్యాన్ షోలుగా మార్చుకున్నాడు. తద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.

కొద్ది రోజుల క్రితమే నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఎక్కువ క్లిక్కులను కూడా అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఇక, అతడు ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 'శ్యామ్ సింగ రాయ్' ఒకటి. 'ట్యాక్సీవాలా'తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పూర్తి స్థాయి విభిన్నమైన కథతో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

Nanis Shyam Singha Roy Gets UA Certificate

'శ్యామ్ సింగ రాయ్' మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైనా.. మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడం వల్ల చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి.. వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉన్నా అనుకున్న సమయానికే ఫస్ట్ కాపీని రెడీ చేసుకోగలిగారు. ఇలా ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తైంది. దీంతో బోర్డు దీనికి సర్టిఫికెట్‌ను కూడా జారీ చేసింది.

'శ్యామ్ సింగ రాయ్' మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాను వీక్షించారు. ఈ క్రమంలోనే దీనికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇక, ఇప్పటికే బయటకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం.. ఈ సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు అని తెలిసింది.

వైవిధ్యమైన కథతో రాబోతున్న 'శ్యామ్ సింగ రాయ్' నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో నాని కోరమీసంతో కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక, ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X