మొత్తానికి బిగ్ బడ్జెట్ మూవీపై ఒక అప్డేట్ ఇచ్చిన నాని
ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సోలోగా ఎదిగిన వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. నాని ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటాయని చెప్పవచ్చు. అయితే ఈ హీరో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం నాని లైనప్ ప్రాజెక్టులు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అందులో మొదట టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త పాత్రతో అలరించబోతున్నాడు నాని. నిన్నుకోరి మజిలీ వంటి హిట్ సినిమాలతో సక్సెస్ అందుకున్న శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం శ్యామ్ సింగరాయ్ తో రానున్న నాని ఆ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లలో కనిపిస్తాడని సమాచారం. ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించనున్న ఆ సినిమా రీసెంట్ గా మొదలైంది.

ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఫిబ్రవరి 24న నాని బర్త్ డే సందర్భంగా టక్ జగదీష్ టీజర్ ను ఒకరోజు ముందుగానే విడుదల చేస్తుండగా శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ ను పుట్టినరోజున రివీల్ చేయనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











