Shyam Singha Roy OTT Release.. సంక్రాంతి కానుకగా ఎప్పుడు.. ఎక్కడ రిలీజ్ అంటే..

నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి, కృతిశెట్టి కలిసి నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం థియేటర్లలో భారీ స్పందనను కూడగట్టుకొంటుంది. రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి రూపొందించిన పిరియాడిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలివారాంతం తర్వాత భారీ కలెక్షన్లను రాబట్టుకొంటున్నది. అయితే ఈ సినిమాను ఓటీటీ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

60 కోట్ల బడ్జెట్‌తో

60 కోట్ల బడ్జెట్‌తో

సత్యదేవ్ జంగా అందించిన విభిన్నమైన కథను రెండు విభిన్నమైన వేరియేషన్స్‌తో తెరకెక్కింది. 50వ దశకంలో బెంగాల్‌లోని ఓ రచయిత శ్యామ్ సింగరాయ్ తన ప్రాంతంలో దేవదాసిలను కాపాడేందుకు వ్యవస్థపై ఎలాంటి పోరాటం చేశారనే విషయం ప్రేక్షకులను మెప్పించింది. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రెస్పాన్స్ కూడా అదే మోతాదులో ఉంది.

5 రోజుల్లోనే 20 కోట్లకు చేరువగా

5 రోజుల్లోనే 20 కోట్లకు చేరువగా

సాయిపల్లవి, నాని, కృతిశెట్టి ఫెర్ఫార్మెన్స్ పరంగా దుమ్మురేపడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయిపోయారు. దాంతో ఈ సినిమా గత ఐదురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 35.45 కోట్ల గ్రాస్, 19.94 కోట్ల నికర కలెక్షన్లను రాబట్టింది.

యూఎస్‌లో పబ్లిక్ డిమాండ్ మేరకు

యూఎస్‌లో పబ్లిక్ డిమాండ్ మేరకు

శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ కనిపిస్తున్నది. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ సినిమాను అమెరికాలో అదనంగా స్క్రీన్లను పెంచడం గమనార్హం. పబ్లిక్ డిమాండ్ కారణంగా 21 లోకేషన్లలో ఈ సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించారు. దాంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నది.

శ్యామ్ సింగరాయ్ ఓటీటీలోకి

శ్యామ్ సింగరాయ్ ఓటీటీలోకి

శ్యామ్ సింగరాయ్ చిత్రం రిలీజ్‌కు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అయితే శ్యామ్ సింగరాయ్ కూడా ఓటీటీలో ప్రచారం అవుతుందనే విషయం మీడియాలో ప్రచారమైంది. అయితే ఆ వార్తలను ఖండిస్తూ ఈ సినిమాను నాని థియేటర్లలోకి పట్టుకొచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడూ ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

జనవరి మూడో వారంలో రిలీజ్‌కు ప్లాన్

జనవరి మూడో వారంలో రిలీజ్‌కు ప్లాన్

అయితే శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని జనవరి మూడో వారంలో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ద్వారా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా జనవరి 15న గానీ, లేదా 18వ తేదీన గానీ రిలీజ్ చేసే అవకాశం ఉందనే వార్త మీడియాలో విస్త‌ృతంగా ప్రచారం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X