పెద్ద హీరోల రేంజ్‌లో నాని డీలింగ్స్.. 'శ్యామ్ సింగరాయ్'కు అప్పుడే అన్ని కోట్లా?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఎట్రాక్ట్ చేస్తాయి. ఓపెనింగ్స్ తోనే ఈ మధ్య రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాడు. అయితే నాని రొటీన్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు అని కామెంట్స్ కు కొత్త కథలను సెలెక్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు కౌంటర్లు ఇస్తున్నాడు. ఇక మొదటిసారి శ్యామ్ సింగరాయ్ అనే బిగ్ బడ్జెట్ పిరియాడిక్ సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

హిట్టు కొట్టి చాలా కాలమయ్యింది

హిట్టు కొట్టి చాలా కాలమయ్యింది

నిజానికి నాని బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్టు కొట్టి చాలా కాలమయ్యింది. 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి తరువాత బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కూడా భారీ స్థాయిలో లాభాలను ఆ దించలేకపోయింది. మధ్యలో జెర్సీ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక గ్యాంగ్ లీడర్ సినిమా కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచింది.

25వ సినిమాతో ఫ్లాప్

25వ సినిమాతో ఫ్లాప్

రిజల్ట్స్ తో సంబంధం లేకుండా నాని కాస్త విభిన్నంగా కథలను ఎంచుకుంటున్నట్లు అర్ధమవుతోంది. అయితే గత ఏడాది 25వ సినిమా V మాత్రం ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన ఆ సినిమా కరోనా టైమ్ లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

టక్ జగదీష్ పై కాన్ఫిడెన్స్

టక్ జగదీష్ పై కాన్ఫిడెన్స్

ఇక నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు. శివ నిర్వణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. టక్ జగదీష్ పై నాని చాక గట్టి నమ్మకంతో ఉన్నాడు.

Recommended Video

Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu
ఆ డీల్ సెట్టయితే..

ఆ డీల్ సెట్టయితే..

ఇక నాని ఫ్యాన్స్ ఎక్కువగా శ్యామ్ సింగరాయ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ డీల్స్ కు సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఇటీవల డిజిటల్, శాటిలైట్ కు సంబంధించిన ఆఫర్స్ రాగా 30 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. హాట్ స్టార్, జీ5 ఈ డీల్ కోసం ఎగబడుతున్నట్లు టాక్. నిర్మాతలతో చర్చలైతే నడుస్తున్నాయి గాని ఇంకా డీల్ క్లోజ్ అవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ సెట్టయితే నాని స్టార్ హీరోలకు రేంజ్ కు తక్కువేమి కాదని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X