For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shyam Singha Roy teaser: రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారితే.. కృతి శెట్టి, నాని లిప్ లాక్!

  |

  నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక కొత్త పాయింట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. మొన్నటి వరకు కాస్త రొటీన్ ఫ్యామిలీ లవ్ కమర్షియల్ సినిమాలను చేసిన నాని ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో విభిన్నమైన సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక నాని సినిమా కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. ఇక పిరియాడిక్ థ్రిల్లర్ గా తెరపైకి రాబోతున్న శ్యామ్ సింగరాయ్ టీజర్ ను నేడు విడుదల చేశారు. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చాలా విభిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది.

  Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
  ఇంట్రెస్టింగ్ టీజర్

  ఇంట్రెస్టింగ్ టీజర్

  నేచురల్ స్టార్ నాని సాయి పల్లవి కృతి శెట్టి నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తరువాత దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. టీజర్ లో నాని రెండు విభిన్నమైన పాత్రలతో అలరించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో పూర్వజన్మ ప్రస్తుత జన్మ అంశాలను కూడా హైలెట్ గా చూపించబోతున్న ట్లు అనిపిస్తుంది.

  దేవుడే రాక్షసుడిగా మారితే

  పురాణకాలంలోని ఆచారాల వలన స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక ఆ తర్వాత ఒక చదువుకున్న వ్యక్తి వారిని ఏ విధంగా ఆ దేవుడి నుంచి రక్షించాడు అనే పాయింట్ కూడా హైలెట్ చేశారని తెలుస్తోంది. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారితే ఎలా ఉంటుంది? అని లైన్ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తుంది. ఇక ఆ దేవుడి ఆచారాల నుంచి శ్యామ్ సింగరాయ్ వచ్చిన వారిని ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాడు అనేది టీజర్ లోనే క్లారిటీ గా అర్థమైంది.

  కృతి శెట్టి లిప్ కిస్

  కృతి శెట్టి లిప్ కిస్

  ఇక సాయి పల్లవి కూడా ఉగ్రరూపంతో చాలా పవర్ఫుల్ పాత్రతో కనిపిస్తుంది. ఇక నాని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరించబోతున్నారు. ఇక నాని కృతి శెట్టి కి లిప్ కిస్ ఇచ్చిన సీన్ కూడా టీజర్ లో హైలెట్ గా నిలిచింది.. చూస్తుంటే సినిమాలో థ్రిల్లర్ అంశాలతో పాటు మంచి ప్రేమకథ రొమాన్స్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. అసలైతే సినిమా ఈ ఏడాది దసరా సమయంలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

  సాయి పల్లవి పవర్ఫుల్ రోల్

  సాయి పల్లవి పవర్ఫుల్ రోల్

  మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమా టీజర్ అయితే సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని అనిపిస్తోంది. సాయి పల్లవి పాత్ర కూడా సినిమాలో చాలా కీలకం కానుందని మరోసారి క్లారిటీ వచ్చేసింది. డీకే ఆమెకు సంబంధించిన స్టిల్స్ కూడా ఇది వరకే మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక సినిమాను డిసెంబర్ 24వ తేదీన తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చూస్తున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

  సత్యదేవ్ అందించిన కథ.. పేలిన రాహుల్ డైలాగ్స్

  సత్యదేవ్ అందించిన కథ.. పేలిన రాహుల్ డైలాగ్స్

  ఇంటెన్సివ్, భావోద్వేగమైన కథతో రూపొందిన శ్యామ్ సింగరాయ్ చిత్రం టీజర్‌లో ఆకట్టుకొనే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. అత్యంత భావోద్వేగాలతో సాగే ఈ కథను సత్యదేవ్ జంగ అందించారు. ఇటీవల కాలంలో తెలుగు తెరను తట్టని కథను సత్యదేవ్ అందించారని ప్రచారం జరుగుతున్నది. ఇక ఇలాంటి ఎమోషనల్ కథను దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ మరో లెవల్‌కు తీసుకెళ్లినట్టు స్పష్టంగా కనిపించింది.

  రాయడమే కాదు.. కాలరాయడం తెలిసిన అక్షరం పట్టుకొన్న ఆయుధమే శ్యామ్ సింగరాయ్ అంటూ చెప్పిన డైలాగ్స్ సినిమా ఏం రేంజ్‌లో ఉంటుందనే విషయం టీజర్ స్పష్టం చేసింది. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.

  English summary
  Nani Shyam Singha Roy telugu teaser
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X