For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సినిమాకు సైన్ చేసిన నాని... హిట్ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ!

    |

    నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో నటించిన 'గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ 13న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరో వైపు 'వి' అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'వి' చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.

    మరో వైపు పలువరు ఫిల్మ్ మేకర్స్ నానితో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. కొందరు తమ వద్ద ఉన్న ఇంట్రస్టింగ్ స్క్రిప్టులను అతడికి వినిపిస్తున్నారు. వీటిలో శివ నిర్వాణ చెప్పిన కథ నచ్చడంతో నాని వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్స్ మొదలయ్యే అవకాశం ఉంది.

    Nani signed his next with Shiva Nirvana

    శివ నిర్వాణ ఇంతకు ముందు నాని హీరోగా నిన్ను కోరి సినిమా చేశాడు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత జంటగా రూపొందించిన 'మజిలి' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. తాజాగా తాను చెప్పిన లైనుకు నాని ఓకే చెప్పడంతో స్క్రిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట శివ నిర్వాణ. సాహు గారపాటి, హరీష్ పెద్ద షైన్ స్క్రీన్స్ బేనర్‌పై నిర్మించబోతున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

    'గ్యాంగ్ లీడర్' మూవీ విషయానికొస్తే.. నానితో పాటు ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

    English summary
    Natural Star signed his next project that will start rolling early next year. Shiva Nirvana is directing this film. Sahu Garapati and Harish Peddi will bankroll this untitled film on Shine Screens banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X