అందులో నాని బ్యాడ్.. నేచురల్ స్టార్ పై సొంత సిస్టరే కంప్లైంట్!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు నచ్చిన కథలతో ఆయా చిత్రాలను సైతం నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాని తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా ద్వారా ఆసక్తికరమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నారు. డీ ఫర్ దోపిడీ, అ, హిట్ఃది ఫస్ట్ కేసు వంటి చిత్రాలను నిర్మించారు. అలాగే.. మీట్ క్యూట్ వెబ్ సిరీస్ ను కూడా నిర్మించారు. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో అలరించేందుకు వస్తున్న చిత్రమే.. కోర్టు.
ఈ చిత్రాన్ని నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై నిర్మిస్తున్నారు. నానితో పాటు ప్రశాంతి త్రిపరనేని కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. న్యాయవ్యవస్థలోని పలు ఆసక్తికరమైన అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరో పదిరోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను ఇప్పటి నుంచే జోరుగా నిర్వహిస్తూ సినిమా రీచ్ ను పెంచుతున్నారు.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని నాని ప్రమోషనల్ ఈవెంట్ లో చెబుతున్నారు. తాజాగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించి.. కోర్టు సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. నటీనటులు, టెక్నీకల్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ఎఫర్ట్ కనిపిస్తోందని, తప్పకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇష్టపడుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నాని సిస్టర్, ప్రొడ్యూసర్ దీప్తి గంట నానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సొంత బ్యానర్ తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను తెరకెక్కిస్తున్న నానిపై సొంత సిస్టర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. నానికి అసలు ప్రొడ్యూస్ చేయడం రాదు అనింది. దీంతో అంతా షాక్ అయ్యారు. కానీ ఆమె ఉద్దేశం మంచిదే. నాని డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సినిమాలు తీయడం లేదని చెప్పింది. నటీనటులకు తన ప్రొడక్షన్ అన్ని రకాల గౌరవం అందాలని, నటులు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించి సినిమాలు తీస్తున్నారు. పైగా కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ ఎలాంటి లాభాపేక్షణ లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారంది. ఇలా సినిమాలు చేస్తూ పోస్తే ఆయనకు ఏం మిగలదని.. అందుకే నాని బ్యాడ్ ప్రొడ్యూసర్ అని అంటున్నట్టు మళ్లీ క్లారిటీ ఇచ్చింది.

ఇక నాని ప్రస్తుతం హిట్3తో అలరించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిట్ సిరీస్ ఎంత సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ క్రమంలో థర్డ్ కేసును చేధించేందుకు నాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మరింత ఆసక్తిని పెంచుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న హిట్ యూనివర్సన్ కూడా నానినే ప్రొడ్యూస్ చేయడం వివేషం. ఇక నాని మరోవైపు ప్యారడైజ్ చిత్రాన్ని కూడా కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే సుజీత్ దర్శకత్వంలో కూడా ఓ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











