Spark of Dasara: ఊరమాస్ గెటప్‌తో షాకిచ్చిన నాని.. మరో పాన్ ఇండియా సర్‌ప్రైజ్!
ఆ మధ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపించాడు నేచురల్ స్టార్ నాని. అయితే, 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోవడం కోసం చాలా కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని తర్వాత అతడు చేసిన 'గ్యాంగ్ లీడర్' ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. ఆ తర్వాత 'వీ', 'టక్ జగదీష్' వంటి సినిమాలు చేసినా.. అవి ఓటీటీల్లోనే నేరుగా విడుదల అయ్యాయి. దీంతో నానితో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీతో ఈ స్టార్ హీరో విజయాన్ని అందుకున్నాడు. తద్వారా మరోసారి హిట్ ట్రాక్ ఎక్కేసి సత్తా చాటుకున్నాడు.
'శ్యామ్ సింగ రాయ్' సక్సెస్‌తో మాంచి జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని.. ఈ ఉత్సాహంతోనే ఇప్పటికే 'అంటే సుందరానికీ' అనే సినిమాను పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అంటే ఇటీవలే తన 29వ సినిమా 'దసరా'ను ప్రారంభించేశాడు. శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మోషన్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆరంభంలోనే నాని నటిస్తోన్న ఈ మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా అప్పుడే అంచనాలను కూడా ఏర్పరచుకుంది.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దసరా' మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. తెలంగాణలోని బొగ్గు గనుల్లో ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఓ సర్‌ప్రైజ్‌ను వదలబోతున్నట్లు మూవీ యూనిట్ శనివారమే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా దీని నుంచి ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో నాని ఊరమాస్ లుక్‌తో కనిపించి అందరికీ షాకిచ్చాడు.
నాని నటిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా Spark of Dasara పేరిట విడుదలైన వీడియోలో నాని ఎలివేషన్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా అతడు బొగ్గు గనుల్లో నడుచుకుంటూ వస్తుంటాడు. చేతిలో ఉన్న బీడీని అక్కడ మండుతోన్న మంటతో వెలిగిస్తాడు. ఆ సమయంలో వచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ అదిరిపోయాయనే చెప్పాలి. ఆ తర్వాత అతడి వెనుక ఒక సైన్యం ఉన్నట్లుగా చూపించారు. ఇందులో ప్రముఖ కమెడియన్ రియాజ్ కూడా కనిపించాడు. ఇక, ఈ వీడియో చివర్లో ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నట్లు ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.
పక్కా మాస్ కథతో రూపొందుతోన్న 'దసరా' మూవీని శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











