Dasaraలో నాని సరికొత్త ఆయుధం.. రెండు గొడ్డళ్లతో అలా.. సూపర్బ్ గా పోస్టర్!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాడి శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టగా.. అంటే సుందరానికి సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇక హిట్ 2 సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండగా.. మూవీకి సంబంధించి తాజా అప్డేట్ ఇచ్చారు.
నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన దసరా సినిమాను పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. తెలంగాణలోని ఓ గ్రామం వీరపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని సింగరేణి లోకల్ రైళ్లలో బొగ్గును దొంగలించే యువకుడిగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ కోసం మూవీ టీమ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. మార్చి 30 గ్రాండ్ గా విడుదల చేయనున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగా నిర్వస్తున్నారు.

దసరా సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు భారీ ఎత్తున నిర్మించారు. ఇక తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్ లో కథ ఉండటం, ప్రమోషన్స్ లో నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన చమ్కీల అంగీలేసి పాట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఇప్పుడు దసరా సినిమా నుంచి తాజా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మార్చి 14న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచారు. ఈ పోస్టర్ లో రావణ దహనం జరుగుతుండగా.. ఒక ఆయుధంతో నాని ఎదురుగా నిలుచుని ఉండటం అదిరిపోయింది. రెండు గొడ్డళ్లు అటు ఇటు తిరిగి ఉన్నట్లుగా ఆ ఆయుధం ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో మాస్ సినిమాల్లో హీరోలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆయుధాలను వాడుతున్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి, బోయపాటి శ్రీను సినిమాల్లో వాడిన ఆయుధాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications











