Hai Nanna: నాని మూవీ గ్లింప్స్ అదుర్స్.. హీరోయిన్ కూడా అలా అనేసిందేంటి!
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. తనదైన టాలెంట్‌తో టాలీవుడ్‌లో ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్నాడు నేచురల్ స్టార్ నాని. సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే చాలా విజయాలను కూడా అందుకున్నాడు. ఇలా ఈ మధ్యనే నాని 'దసరా' అంటూ వచ్చి పాన్ ఇండియా హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ నేచురల్ హీరో తన 30వ సినిమాను మరో కొత్త దర్శకుడితో చేస్తున్నాడు.
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని.. శౌర్యూవ్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా ఈ మూవీ చిత్రీకరణను జరుపుతున్నారు. ఇలా ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే టాకీ పార్టును 80 శాతం కంటే ఎక్కువగానే పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 21న విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో రాబోతున్న ఈ చిత్రానికి 'హాయ్ నాన్న' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ వీడియోను కూడా వదిలింది. ఇందులో ఓ పాప తన తండ్రిని పరిచయం చేస్తుంది. అప్పుడు నాని ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ గుండెల్ని పిండేలా ఉన్నాయి. ఇక, ఈ వీడియోలోనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా నాని పాత్రను 'హాయ్ నాన్న' అని అంటుంది. దీంతో టైటిల్ కార్డ్ పడుతుంది. మొత్తానికి ఈ గ్లింప్స్ వీడియో ఎంతో ఎమోషనల్‌గా ఉంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

నాని - శౌర్యూవ్ కాంబోలో రాబోతున్న ఈ 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











