Hai Nanna Teaser: సర్‌ప్రైజింగ్‌గా హాయ్ నాన్న టీజర్.. హీరోయిన్‌తో నాని లిప్‌లాక్‌ల వర్షం
స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సహజసిద్ధమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలో చిన్న చిత్రాలకే పరిమితం అయిన అతడు.. ఈ మధ్య కాలంలో రేంజ్‌ను భారీగా పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా భారీ సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇటీవలే నాని 'దసరా' అంటూ వచ్చి పాన్ ఇండియా హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో తన 30వ సినిమాను మరో కొత్త దర్శకుడితో చేస్తున్న విషయం తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రమే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ అనే దర్శకుడు తీస్తున్న ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా ఈ మూవీ చిత్రీకరణను జరుపుతున్నారు. ఇలా ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 21న విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ, తర్వాత పరిణామాలు మారడంతో రిలీజ్ డేట్‌లో మార్పులు చేశారు.

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో రాబోతున్న 'హాయ్ నాన్న' మూవీని డిసెంబర్ 7వ తేదీన విడదుల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అఫీషియల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మొదట తండ్రి, కూతురు బంధాన్ని చూపించారు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం, ఆమె నానితో ప్రేమలో పడడాన్ని హైలైట్ చేశారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య లిప్‌లాక్‌లను ఎక్కువగా చూపించారు. ఇక, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఫలితంగా ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. నాని - శౌర్యూవ్ కాంబోలో రాబోతున్న ఈ 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











