Hi Nanna OTT: నాని మూవీ ఓటీటీ వివరాలు లీక్.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పటి నుంచి అంటే!

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన సహజసిద్ధమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగాడు నాని. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపించడంతో పాటు తన రేంజ్‌ను పెంచుకుంటోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ ఏడాది వచ్చిన 'దసరా'తో పాన్ ఇండియా రేంజ్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

క్రేజీ హిట్‌తో మాంచి జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తన 30వ సినిమాను శౌర్యూవ్ అనే దర్శకుడితో చేశాడు. 'హాయ్ నాన్న' అనే టైటిల్‌తో రూపొందిన ఈ మూవీ తండ్రి కూతురు సెంటిమెంట్‌తో ఎమోషనల్‌గా తెరకెక్కింది. దీంతో ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే.

Nani Starrer Hi Nanna Movie OTT Partner and Streaming Date Details

నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వస్తోంది. ఇదే టాక్ అంతటా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా లభిస్తోంది. అన్ని చోట్లా ఈ సినిమా షోలకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చే చాన్స్ ఉంది.

'హాయ్ నాన్న' సినిమా సందడి థియేటర్లలో మొదలు అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా వార్త బయటకు వచ్చింది.

నేచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్న' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా లీక్ అయింది. అంటే డిసెంబర్ 7వ తేదీన విడుదలైన 'హాయ్ నాన్న' చిత్రం జనవరి రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Nani Starrer Hi Nanna Movie OTT Partner and Streaming Date Details

ఇదిలా ఉండగా.. నాని - శౌర్యూవ్ కాంబోలో తెరకెక్కిన 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషించింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X