ప్రమాదం కంటే ప్రమాదంగా.. ఊహించని విధంగా నాని కొత్త సినిమా గ్లింప్స్
గతంలో కంటే ఇప్పుడు సినీ రంగంలో ఫ్రాంచైజీ మూవీలు రూపొందుతోన్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో మద్దతును దక్కించుకుంటున్నాయి. తద్వారా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచి సత్తా చాటుతున్నాయి. అలాంటి సిరీస్‌లలో 'HIT' ఒకటి. ఫస్ట్ కేస్ పేరుతో వచ్చిన మొదటి సినిమాలో శైలేష్ కొలను దీన్ని తెరకెక్కించాడు.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన మొదటి పార్ట్ సూపర్ హిట్ అవడంతో.. టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో 'HIT: ది సెకెండ్ కేస్'ను తెరకెక్కించారు. ఈ మూవీకి కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం కూడా సూపర్ సక్సెస్ అయింది. దీంతో అప్పుడే దీనికి కొనసాగింపుగా మూడో భాగం కూడా రాబోతుందని ప్రకటించారు.

మొదటి రెండు భాగాలు విజయవంతం అవడంతో ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీ నుంచి 'HIT: ది థర్డ్ కేస్' అనే మూవీ రాబోతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఇందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న అతడు.. తాజాగా ఈ సినిమాను లైన్‌లో పెట్టేశాడు.
నేచురల్ స్టార్ నాని హీరోగా, శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న 'HIT: ది థర్డ్ కేస్' మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఇండియా బోర్డర్‌లో జరిగిన కార్ ఛేజింగ్ సన్నివేశాలను చూపించారు. ముఖ్యంగా ఓ ఏంజెంట్ మరో ఏజెంట్‌తో నాని ప్రమాదంలో ఉన్నాడని చెబుతాడు. అప్పుడు ఆయన 'ప్రమాదం కంటే ప్రమాదకరమైన వాడు' అని బదులిస్తాడు.
తాజాగా వచ్చిన 'HIT: ది థర్డ్ కేస్' మూవీ గ్లింప్స్ వీడియోలో నాని కనిపించిన తీరు ఎంతో కొత్తగా ఉంది. అతడు పవర్‌ఫుల్ కాప్ రోల్‌ను చేస్తున్నట్లు దీనిబట్టి అర్థం అయింది. అంతేకాదు, ఇందులో కనిపించిన విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరాయి. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక, ఇది 2025 మే 1న రిలీజ్ కాబోతున్నట్లు కూడా ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. నాని - శైలేష్ కొలను కాంబినేషన్‌లో రాబోతున్న 'HIT: ది థర్డ్ కేస్' సినిమాను నేచురల్ స్టార్ సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











