HBD Nani: శనివారం మాత్రమే కోపం చూపించే హీరో.. ఇంట్రెస్టింగ్‌గా సరిపోదా శనివారం గ్లింప్స్

ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న తెలుగు హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. గత ఏడాది 'దసరా' వంటి పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. ఆ వెంటనే 'హాయ్ నాన్న' అనే ఫీల్ గుడ్ మూవీతో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ ఊపులోనే మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతూ కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

'హాయ్ నాన్న' మూవీ రిలీజ్ కాకుండానే నాని తన 31వ సినిమా 'సరిపోదా శనివారం'ను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. దీన్ని 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికీ' వంటి క్రేజీ మూవీలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

Nani Starrer Saripodha Sanivaaram Movie Glimpse Released

నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని మరికొన్ని నెలల్లోనే విడుదల చేయాలని చూస్తున్నారు.

విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇటీవలే గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ఇక, ఈరోజు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ ఎస్‌జే సూర్య డైలాగులు పలికాడు. ప్రతి ఒక్కరికీ కోపం ఉంటుందని, దాన్ని పద్దతిగా చూపించేవాడే ఈ సూర్య అని హీరో గురించి చెప్పాడు. అంతేకాదు, శనివారం మాత్రమే అతడు కోపాన్ని చూపిస్తాడని చెప్పి సినిమాపై ఆసక్తిని పెంచేశాడు. ఈ వీడియోలో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్, నాని లుక్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ గ్లింప్స్ అన్ని వర్గాల వాళ్లను మెప్పించే విధంగా ఉంది.

ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కలయికలో రాబోతున్న 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X