Saripodha Sanivaaram: ఇంక 26 శనివారాలు.. డేట్‌తో సర్‌ప్రైజ్ చేసిన నాని

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన రీతిలో ప్రేక్షకులను అలరించి స్టార్లుగా మారిపోయారు. వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. హీరోగా కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్న అతడు.. ఈ మధ్యన హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు.

నేచురల్ స్టార్ నాని గత ఏడాది 'దసరా', 'హాయ్ నాన్న' వంటి హిట్లను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేస్తున్నాడు. 'అంటే సుందరానికీ' మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

Nani Starrer Saripodha Sanivaaram Movie Release Date Announced

వివేక్ ఆత్రేయ - నాని కాంబినేషన్‌లో విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదే మొదలైంది. అప్పటి నుంచి ఇది శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్లు చేసుకుంటూ వెళ్తోంది.

క్రేజీ సబ్జెక్టుతో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇటీవలే గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. అప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల తేదీని ప్రకటించారు.

నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' మూవీని ఆగస్టు 29వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు, అప్పటి వరకూ ఇంకా 180 రోజుల సమయం ఉందని, ఇంక 26 శనివారాలు వస్తాయని విభిన్నంగా తెలిపింది. మొత్తానికి నాని సినిమా రిలీజ్ డేట్ రావడంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కలిసి చేస్తున్న 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X