Saripodha Sanivaaram: సర్‌ప్రైజింగ్‌గా నాని మూవీ గ్లింప్స్.. చివరి షాట్ మాత్రం హైలైట్

తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అలాంటిది 'దసరా' వంటి పాన్ ఇండియా హిట్ సొంతం అవడంతో అతడు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఈ టాలెంటెడ్ హీరో 'హాయ్ నాన్న' అనే ఫీల్ గుడ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

'హాయ్ నాన్న' మూవీ రిలీజ్ కాకుండానే నాని తన 31వ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. దీన్ని 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికీ' వంటి క్రేజీ మూవీలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నాడు. ఇటీవలే ప్రకటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తారు.

Nani Starrer Saripodha Sanivaaram Movie Unchained Glimpse Released

నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి 'సరిపోదా శనివారం' అనే విభిన్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన Unchained Glimpseలో రివీల్ చేశారు. ఇక, ఈ వీడియోను విభిన్నమైన కంటెంట్‌తో రూపొందించారు. దీంతో ఈ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేశారు.

తాజాగా వచ్చిన 'సరిపోదా శనివారం' Unchained Glimpse వీడియోలో హీరో నానిని ఓ గొడౌన్‌లో బంధించి ఉంచారు. బ్యాగ్రౌండ్‌లో 'మన పెద్దలు ఒక మాట అనే వారు. రాజుకైనా బంటుకైనా.. ఎలాంటి వాడికైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలి అని. అదే మాటను మన కొత్త తరం కుర్రాళ్లు కొంచెం మార్చి నీకంటూ ఓ టైం వస్తుందిరా. అందాక మూసుకుని వెయిట్ చెయ్ అన్నారు. ఇప్పుడు మన కథ ఈ రెండు తరాల గురించి కాదు. ఒక్క రోజు కోసమే' అంటూ సాయి కుమార్ చెప్పై డైలాగ్ అదిరిపోయింది.

Nani Starrer Saripodha Sanivaaram Movie Unchained Glimpse Released

'సరిపోదా శనివారం' Unchained Glimpse వీడియోలో గడియారంలో టైం 12 అవగానే నానిలో మరో కోణాన్ని చూపిస్తాడు. అంతేకాదు, వెంటనే తన కట్లను చీల్చుకుని బయటకు వస్తాడు. అప్పుడు అతడిని అందరూ అలాగే చూస్తుండిపోగా.. ఓ చిన్నారి మాత్రం నవ్వుతుంది. దీంతో ఈ గ్లింప్స్ ముగిసింది. ఇక, ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ అదిరిపోయాయి.

ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X