ప్రియాంక రెడ్డి హత్య : ఆమె ఆత్మకు శాంతి.. అది సాధ్యమేనా? టాలీవుడ్ హీరోల రియాక్షన్
మానవ మృగాల రాక్షసత్వానికి బలైన ప్రియాంక రెడ్డి తరుపున యావత్ లోకం నిలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. విద్యార్థి లోకం, మహిళా సంఘాలు, సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్, అనుష్క, సాయి ధరమ్ తేజ్, పూజా హెగ్డే, మంచు లక్ష్మీ, సుమ లాంటి వారు ఈ ఘటనపై స్పందించగా.. మరి కొంత మంది హీరోల రియాక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
ఎంతగా బాధపడుతున్నానంటే..
ఈ ఘటన గురించి చెప్పడానికి సిగ్గుపడే స్థాయిలో ఉంది.. నేను చాలా బాధపడ్డాను.. నా సాంకేతికను వాడండి, లైవ్ లొకేషన్ యాప్స్‌ను వాడండి, అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయండని అక్కా చెల్లెల్లందరినీ కోరుతున్నానంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశాడు.
వీటన్నంటిని ఆపాలి..
ప్రియాంక రెడ్డికి సంబంధించిన వార్త విని చాలా బాధపడ్డాను. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతూ ఉంటాయి? వీటన్నంటిని ఆపాలి. మన దేశం వీటన్నంటికి చరమగీతం పాడాలే చేయాలి. ఆడవారందరికీ రక్షణ కల్పించాలంటూ అఖల్ ట్వీట్ చేస్తూ.. ప్రియాంకరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.
అది మోడీనే చేయగలడు..
ఇలాంటి ఘోరమైన ఘటనలను ఆపాలంటే..అలాంటి వారిని ఉరి తీయాలని నిఖిల్ ఉద్వేగపూరితంగా స్పందించాడు. నరేంద్రమోడీకి ఆ శక్తి ఉందని.. అలా చేయాలని ఆయన్ను కోరాడు. మమ్మల్ని క్షమించు..నీకు ఈ దుస్థితిని కల్పించిన సమాజ పట్ల సిగ్గేస్తుందని.. ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశాడు.
Recommended Video
ఏం చేసినా న్యాయం చేసినట్టు కాదు..
మేము న్యాయం కూడా అడగము.. ఎందుకుంటే ఇలాంటి పని చేసిన వాడిని ఏం చేసినా.. ఆ అమ్మాయికి న్యాయం చేసినట్టు కాదు.. ఆమె ఆత్మకు శాంతి..? అది సాధ్యమేనా? నాకు చాలా కోపం వస్తుంది.. కానీ నిస్సహాయుడి అంటూ నాని ట్వీట్ చేస్తూ.. ఆమె కుటుంబం పట్లసున్నితంగా వ్యవహరించండని మీడియాను కోరాడు.


Click it and Unblock the Notifications











