Bloody Romeo: బ్లడీ రోమియోగా నాని.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో సుజిత్ బీభత్సం

నేచురల్ స్టార్ నాని (Nani) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ అందింది. ఇప్పటికే ది ప్యారడైజ్ (The Paradise) అప్‌డేట్‌తో జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు, తన 32వ చిత్రంగా మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ నాని అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'ఓజీ' ఫేమ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుంది. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో రూపంలో ఆసక్తికరంగా రివీల్ చేశారు. ఇంతకీ మూవీ టైటిల్ ఏంటీ?

టైటిల్ వీడియోతోనే క్యారెక్టర్ హింట్స్
నాని - సుజీత్ కాంబో మూవీకి 'బ్లడీ రోమియో'(Bloody Romeo)అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ఖరారు చేశారు. విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియోలోనే హీరో పాత్ర టోన్‌ను ఆసక్తికరంగా రివీల్ చేశారు. 'చిటికెడు కరుణ, పడికెడు కోపం, బారెడు బీభత్సం... మతిపోయేంత ప్రేమ' అంటూ వంటకం రూపకంలో నాని క్యారెక్టర్ షేడ్స్ చూపించారు. ఈ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అవుతున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుందని యూనిట్ స్పష్టం చేసింది.

Nani Sujeeth Movie Titled Bloody Romeo Gangster Action Thriller Announced on Nani Birthday

'ఓజీ' తర్వాత సుజీత్ నుంచి మరో స్టైలిష్ ట్రీట్
సుజీత్ గతంలో పవన్ కళ్యాణ్‌తో చేసిన OG లాంటి హై-వోల్టేజ్ ప్రాజెక్ట్‌తో యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నానితో కలిసి అంతర్జాతీయ లొకేషన్స్‌లో యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేయడం ట్రేడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమా 'ఓజీ' యూనివర్స్‌కు సంబంధం లేదని, సుజీత్ తొలి చిత్రం రన్ రాజా రన్ తరహాలో స్టైలిష్ యాక్షన్‌తో పాటు డార్క్ క్రైమ్ కామెడీ టచ్ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. 'బ్లడీ రోమియో'లో నాని ఒకవైపు చెఫ్‌గా కనిపిస్తూనే, మరోవైపు గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించనున్నారట. రఫ్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్, సుజీత్ మార్క్ స్టైలిష్ ప్రెజెంటేషన్ కలిసి ఇది మాస్-క్లాస్ మిక్స్ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోందని టాక్.

హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి, పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అధికారిక కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా రాలేదు. ఈ ప్రాజెక్ట్‌ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు నాని సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ఈ ఏడాది డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి 2026 క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేయాలన్నది టీమ్ లక్ష్యం.

ఒకవైపు 'ది ప్యారడైజ్', మరోవైపు 'బ్లడీ రోమియో' ఈ రెండు సినిమాలతో నాని అభిమానులకు డబుల్ ట్రీట్ ఖాయం అన్న మాట వినిపిస్తోంది. యూరప్ లొకేషన్స్, గ్యాంగ్‌స్టర్ నేపథ్యం, కొత్త తరహా హీరో క్యారెక్టర్‌తో 'బ్లడీ రోమియో' టాలీవుడ్‌లో మరో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలవబోతోందన్న అంచనాలు ఇప్పటికే పీక్స్‌కు చేరాయి. నాని బర్త్‌డే కానుకగా వచ్చిన ఈ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Read more about: happy birthday nani nani sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X