వెరీ ఇంట్రెస్టింగ్: ‘V’ సినిమాలో నాని విలన్ కాదు.. ఆ బాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తారట.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అతడు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అదే నానికి ప్లస్ అయింది. దాదాపుగా ఈ నేచురల్ స్టార్ చేసిన సినిమాలన్నీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంటూ వచ్చాయి. అయితే, ఈ మధ్య అతడి పరిస్థితి దానికి భిన్నంగా తయారైంది. రెండు ఫ్లాప్ మూవీలు.. ఒక హిట్.. మరో ఫ్లాప్ ఇలా అతడి గ్రాఫ్ నడుస్తోంది. దీంతో నాని కూడా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఓ ప్రయోగానికి సిద్దం అయ్యాడు. తాజాగా దానికి సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ అయింది. ఇంతకీ ఏంటా కథ..? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆ ఉత్సాహంతో వస్తే నిరాశను మిగిల్చింది
నాని ‘జెర్సీ' విజయంతో ఉత్సాహంగా ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పేశాడు. ‘గ్యాంగ్ లీడర్' టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కింది. రివైంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో నానికి, అతడి ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు.

ఈ సారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాడు
‘గ్యాంగ్ లీడర్' రిలీజ్ కాకముందే నాని ‘V' అనే సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీళ్లిద్దరి సరసన నివేదా థామస్, అతిథి రావు హైదరీ ఆడి పాడనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత భాగాన్ని ఇప్పటికే షూట్ చేశారు.

అప్పటి నుంచే నానిని సైకో కిల్లర్ అన్నారు
‘V' సినిమా షూటింగ్ ప్రారంభం అయిన సమయంలో నాని ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశాడు. ‘నన్ను హీరోగా పరిచయం చేసింది ఈయనే. ఈరోజు నా 25వ సినిమానూ డైరెక్ట్ చేస్తున్నాడు. కానీ, ఈ సారి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాం' అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ సినిమాలో నాని సైకో కిల్లర్‌గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

సినిమాలో నాని విలన్ కాదు
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో నాని విలన్‌గా నటించబోతున్నాడనేది నిజమేనట. అయితే, అతడు అందరిలా బ్యాడ్ విలన్ కాదట. ఓ సమస్యను పరిష్కరించేందుకు అతడు విలన్‌లా మారతాడని సమాచారం. అంటే ఇందులో నాని మంచి విలన్ అన్న మాట.
Recommended Video

ఆ సినిమాలను గుర్తు చేస్తారట
తక్కువ బడ్జెట్‌తోనే వస్తున్నా ‘V' సినిమా ఎంతో రిచ్‌గా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో నాని, సుధీర్ బాబు మధ్య పోరాట సన్నివేశాలు, చేజింగులు ‘ధూమ్' సిరీస్‌ను తలపిస్తాయని అంటున్నారు. ఆ సిరీస్‌లో వచ్చిన సినిమాల్లో హీరోనే విలన్ పాత్రను పోషించాడు. అలాగే, ఇందులో కూడా నాని కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











