కెరీర్‌లోనే బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడితో నాని మరో మూవీ: ముహూర్తం కూడా ఫిక్స్
స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా మారాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలోనే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాని ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'టక్ జగదీష్' విడుదలకు సిద్ధంగా ఉండగా.. 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికీ' షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ లీకైంది.
ప్రస్తుతం నాని మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో ప్రాజెక్టును తాజాగా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'జెర్సీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన గౌతమ్ తిన్ననూరితో నేచురల్ స్టార్ నాని మరో సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం అతడు షాహీద్ కపూర్ హీరోగా 'జెర్సీ' హిందీ రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తైంది. త్వరలోనే విడుదల కాబోతుంది. దీని తర్వాత గౌతమ్.. నానితోనే సినిమా చేస్తాడని, దీపావళి కానుకగా ఈ మూవీ ప్రారంభం కాబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రమే 'జెర్సీ'. యూనివర్శల్ సబ్జెక్ట్ అయిన క్రికెట్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి ఫ్లాపుల తర్వాత నానిని హిట్ ట్రాక్ ఎక్కించడంతో పాటు కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక, ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో రెండు విభాగాల్లో ఎంపికైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











