బాక్సాఫీస్ ఫైట్: మొత్తానికి ఒకరు తగ్గారు.. రిలీజ్ డేట్ చేంజ్!
బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత నెవర్ బిఫోర్ అనేలా యుద్ధాలు జరగబోతున్నాయి. అయితే కొందరు మాత్రం వీలైనంత వరకు ఆ పోటీని తగ్గించుకుంటున్నారు. ఎంతో ఖర్చు చేసి తెరకెక్కించిన సినిమాలతో పోటీ పడటం చాలా వరకు రిస్క్ తో కూడుకున్న పని. అయితే తగిన సమయంలో విడుదల చేయకపోయినా కూడా చాలా రిస్క్ అనే చెప్పాలి. అందుకే రిలీజ్ డేట్స్ పై నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి.
రెండు సినిమాలు ఒకేసారి వస్తే ఎంతో కొంత కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడక తప్పదు. అందుకే కొందరు లేటయిన కూడా ఒంటరిగానే రావడానికి ఇష్టపడతారు. ఇక లాక్ డౌన్ లో సినిమాను విడుదల చేయడానికి ఇష్టపడని శేఖర్ కమ్ముల టీమ్ నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమాను సమ్మర్ కు ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టొరీ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

అయితే వారికి పోటీగా నాని కూడా ఉన్నాడు. లవ్ స్టొరీ కంటే ముందే టక్ జగదీష్ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోటీగా లవ్ స్టొరీ రావడంతో టక్ జగదీష్ నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక మొత్తానికి అదే నిజమయ్యింది. నిజానికి రెండు సినిమాలకు మంచి బజ్ అయితే ఉంది. దీంతో క్లాష్ అయితే బావుండదని సినిమా సినిమాకు ఒక వారం గ్యాప్ ఉండేలా విడుదల చేస్తున్నారు. టక్ జగదీష్ సినిమాను 23న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ వ్యత్యాసం ఇద్దరికి ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











