పరిచయానికి మేం రెడీ.. ఫుల్ స్వింగ్‌లో నాని
నాని ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. జాతీయ అవార్డుల్లో జెర్సీ దుమ్ములేపడంతో నాని ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇదే జోరులో నాని తన టక్ జగదీష్ మూవీ అప్డేట్ కూడా ఇచ్చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని మళ్లీ ఓ కొత్త కథతో ప్రయోగం చేయబోతోన్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. తమన్ అందించిన పాటలు, చిత్రయూనిట్ స్పెషల్‌గా డిజైన్ చేసిన పోస్టర్లు అన్నీ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి.
ప్రస్తుతం నాని తన తదుపరి చిత్రంపైనే ఫోకస్ పెట్టేశాడు. టక్ జగదీష్‌ను భారీగానే ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో వినూత్నంగా ప్రమోషన్ కార్యక్రమాలను ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ మేరకు పరిచయ వేడుక అని ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. పరిచయానికి మేం రెడీ అంటూ రచ్చ చేస్తున్నాడు. దీని కోసం మంచి ఈవెంట్‌ను ప్లాన్ చేసింది జక్ జగదీశ్ యూనిట్.

పరిచయ వేడుక అని.. పరిచయానికి మేం రెడీ.. మీరు రెడీ ఆ? అని చిత్రయూనిట్ తెలిపింది. జగదిని ప్రజలకు మొదటిసారిగా పరిచయం చేసే ఈ ఈవెంట్‌ను రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్‌లో మార్చి 27న సాయంత్రం ఆరు గంటలకు ఈవెంట్‌ను ఏర్పాటు చేశామని యూనిట్ ప్రకటించింది. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నటిస్తోన్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











