టక్ జగదీష్ అప్డేట్.. ఊరిస్తోన్న యూనిట్

న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే ప్రేక్షకులకు ఎప్పుడూ కూడా ఓ రేంజ్ అంచనాలుంటాయి. నాని కొత్తగా ట్రై చేస్తాడని రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయనే నమ్మకంతో థియేటర్లకు వస్తుంటారు. అలా నాని సినిమాలు దాదాపు అన్నీ కూడా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. అయితే ఆ మధ్య మాత్రం మాస్ మసాలా అంటూ కమర్షియల్ ఫార్మాట్‌లో కొన్ని ట్రై చేశాడు నాని. కానీ ప్రేక్షకులు వాటిని తిరస్కరించారు.

దాంతో ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే జెర్సీ అనే సినిమాను చేశాడు. దీంతో నాని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు సైతం కనెక్ట్ అయ్యాడు. ఈసినిమా ఇచ్చిన ఊపుతో నాని మరిన్ని కొత్త కథలకు ఓకే చెప్పాడు. అందులో భాగంగానే V అనే చిత్రాన్ని చేశాడు. కానీ అంతగా మెప్పించలేకపోయింది. అయితే నాని చేతిలో ఇప్పుడు టక్ జగదీష్, శ్యామ్ సింఘరాయ్ వంటి సినిమాలున్నాయి.

 nani Tuck Jagadish Update On 18th December

శివ నిర్వాణ నాని అంటే హిట్ కాంబినేషన్. నిన్ను కోరి సినిమా తరువాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌‌లో టక్ జగదీష్ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, సెట్‌లోంచి నాని షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించారు. సింగిల్ షెడ్యూల్‌లోనే అంతా కానిచ్చేశారు. ఇక రేపు (డిసెంబర్ 18) ఓ అప్డేట్ రాబోతోందంటూ అందరినీ ఊరిస్తున్నారు. రేపు ఉదయం 10 35గంటలకు అప్డేట్ రాబోతోందని ప్రకటించారు. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X