అమ్మ బాబోయ్.. నాని కోసం ఏకంగా ఒక కొత్త నగరం.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారంటే?

సినిమా ప్రపంచంలో ప్రస్తుతం బిగ్ బడ్జెట్ సినిమాలు హీరోల మార్కెట్ తో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎక్కువగా కంటెంట్ నమ్ముకొని నిర్మాతలు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక నానితో కూడా భారీ సినిమాలు నిర్మిస్తే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ గా నిలుస్తాయని నమ్ముతున్నారు. ఇక ఇటీవల ఒక పెద్ద నగరానికి చెందిన సెట్ ను హైదరాబాద్ లోనే నిర్మించినట్లు తెలుస్తోంది.

నానితో బిగ్ బడ్జెట్

నానితో బిగ్ బడ్జెట్

నేచురల్ స్టార్ నాని ఏ స్థాయి నుంచి వచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నామి ఆ తరువాత మెల్లగా హీరోగా మారి ఇప్పుడు తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. నానితో బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా చేయవచ్చని ఒక క్లారిటీ వచ్చేసింది.

అంతగా వర్కౌట్ కాలేదు

అంతగా వర్కౌట్ కాలేదు

అయితే నాని చివరగా చేసిన సినిమలేవి కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద లాభాలను అంధించలేదు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికి అంతగా వర్కౌట్ కాలేదు. ఇక V సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

శ్యామ్ సింగరాయ్ పై భారీ అంచనాలు

శ్యామ్ సింగరాయ్ పై భారీ అంచనాలు

ఇక నెక్స్ట్ టక్ జగదీష్ సినిమాతో సిద్దమవుతున్న నాని ఆ సినిమా తరువాత అంతకుమించి అనేలా రెడీ అవుతున్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

10ఎకరాల పొలంలో.. భారీ సెట్స్

10ఎకరాల పొలంలో.. భారీ సెట్స్

ఈ సినిమాకు నాని మార్కెట్ కంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు చేస్తున్నారట. ఇక సినిమాలో దాదాపు కోల్ కత్తా నగరంలోని కీలకమైన ప్రాంతాలను సెట్స్ రూపంలో డిజైన్ చేస్తున్నారట. ముఖ్యంగా కాళీ మాత టెంపుల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందట. హైదరాబాద్ లోని ఒక ప్రాంతంలో 10ఎకరాల పొలంలో దాదాపు 6.5కోట్లతో సెట్ ను నిర్మిస్తున్నట్లు సమాచారం.

Recommended Video

AP లో వివాదం సద్దుమణిగిన తర్వాతే సినిమా రిలీజ్ | Tuck Jagadish Postponed
అలా చేయక తప్పడం లేదు

అలా చేయక తప్పడం లేదు

మొదట కేవలం కాళీ మాత టెంపుల్ అనుకున్నప్పటికి కథకు తగ్గట్లుగా మరికొన్ని సెట్స్ వేయక తప్పడం లేదట. ఈ సినిమాను మొదట సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాలని అనుకుంది. ఇక వాళ్ళు తప్పుకోవడంతో నిహారిక ఎంటర్టైన్మెంట్ అనే కొత్త బ్యానర్ ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X