టక్ జగదీష్.. హంగామా మొదలయ్యేది అప్పుడే.. డేట్ ఫిక్స్!
టాలీవుడ్ నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న యువ హీరో నాని. ఎలాంటి సినిమాతో నైనా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకునే నాని నెక్స్ట్ ఒక డిఫరెంట్ సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. నిన్ను కోరి దర్శకుడితో మరోసారి టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు శివ నిర్వాణ ఇంతకుముందు మజిలీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న అందుకున్నాడు.
ఇక టక్ జగదీష్ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రమోషన్స్ తో ఆ అంచనాల డోస్ ను మరింత పెంచాలని చిత్ర యూనిట్ ఇక నుంచి హడావుడి మొదలు పెట్టనుంది. ఒక స్పెషల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి సిద్దమయ్యారు. ఈ డిసెంబర్ 25న సినిమా ఫస్ట్ లుక్ క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోందని నాని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇక సినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్.

అయితే సినిమాను ఒక బడా ప్రొడ్యూసర్ మొత్తం రిలీజ్ రైట్స్ ను సింగిల్ పేమెంట్ తో కొనుక్కోవడానికి సిద్ధమైనట్లు టాక్.దాదాపు రూ.47కోట్ల వరకు ఆఫర్ చేయడంతో చిత్ర నిర్మాతలు కాదనలేకపోయారట. ఆ సినిమాకు మొత్తం 35కోట్ల లోపే ఖర్చు అయ్యిందట. ఇక అలా చూసుకుంటే వచ్చిన ఆఫర్ లాభమేనని చిత్ర నిర్మాతలు అమ్మడానికి ఒప్పుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. టక్ జగదీష్ అనంతరం నాని "అంటే సుందరానికి".. అలాగే "శ్యామ్ సింగరాయ్" అనే సినిమాలు చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











