నాని-విజయ్ ఫ్యాన్స్ వార్.. ఛల్ హట్.. ఎవ్వడ్రా రౌడీ అంటూ కామెంట్స్

Recommended Video

Nani Vs Vijay Devarakonda Fans | V Teaser | World Famous Lover

విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే ఇంద్రగంటి మోహన కృష్ణ సుధీర్ బాబు, నాని వంటి యంగ్ టాలెంటెడ్ హీరోలతో తెరకెక్కించిన చిత్రం V. న్యాచురల్ స్టార్ నాని నెగెటివ్ రోల్ పోషిస్తుండగా.. నానిని వేటాడే పోలీస్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చకే దారి తీసింది. రౌడీ స్టార్ విజయ్, నాని టీజర్ల రికార్డుల పేరిట ఫ్యాన్స్ వార్ జరుగుతోంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

నాని-విజయ్ ఫ్యాన్స్ కోల్డ్ వార్..

నాని-విజయ్ ఫ్యాన్స్ కోల్డ్ వార్..

నాని స్టార్‌గా దూసుకుపోతుండగా.. తన సినిమా (ఎవడే సుబ్రహ్మణ్యం)లో ఫ్రెండ్ పాత్రను పోషించాడు విజయ్. అయితే కాలం మారుతూ వచ్చింది. విజయ్‌కి హిట్ల మీద హిట్లు పడుతూ సెన్సేషన్ స్టార్, రౌడీ స్టార్ ఇలా ఏవేవో ట్యాగ్స్ వచ్చాయి. అదే టైమ్‌లో నానికి గడ్డు కాలమేర్పడింది. ఇలా వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఏదో తెలియని గొడవ జరుగుతూ వస్తోంది.

జెర్సీతో మళ్లీ ఫామ్‌లోకి..

జెర్సీతో మళ్లీ ఫామ్‌లోకి..

కృష్ణార్జున యుద్దం సినిమాతో డీలా పడ్డ నానికి.. జెర్సీ ఊరటనిచ్చింది. కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా.. సగటు ప్రేక్షకుడు నానిని ఎలా చూడాలనకున్నాడో అలా నటించేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీతో నాని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. అదే సమయంలో ఆ మధ్య రిలీజైన డియర్ కామ్రేడ్, తాజాగా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ బోల్తా కొట్టాయి. ఇప్పుడు విజయ్ డౌన్‌ఫాల్‌లో ఉన్నాడు.

టీజర్ల రికార్డులు..

టాలీవుడ్‌లో ఇప్పుడు రికార్డులంటే కలెక్షన్లు కావు. సోషల్ మీడియాలో వ్యూస్, హిట్స్, లైక్స్ అది కూడా నిమిషాలు, గంటలు, ఒక్క రోజులో ఇలా ఎన్నో లెక్కలున్నాయి. టీజర్, ట్రైలర్ విడుదలైతే చాలు ఈ రికార్డుల గోలలు మొదలవుతాయి. నిన్న సాయంత్రం V టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్..

నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్ వంటి హీరోలను టైర్ 2 కింద జమకట్టేశారు నెటిజన్లు. వీరిలో నాని-విజయ్ ఫ్యాన్స్ మధ్య తాజాగా వార్ మొదలైంది. ఒక గంటలో 43వేల లైకులు సాధించిందని, వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం కేవలం 37వేల లైకులు మాత్రమే వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు.

ఎవడ్రా రౌడీ..

టైర్ 2 హీరోల్లో అతి వేగంగా యాభై వేల లైకులను సాధించింది నాని V టీజర్ అని, అది కేవలం 70 నిమిషాల్లోనే ఆ ఫీట్‌ను సాధించగా.. వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం 72 నిమిషాలను తీసుకుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఎవడ్రా రౌడీ ఎవడికి రా రౌడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X