ప్రారంభమైన నాని క్రేజీ ప్రాజెక్ట్.. కీలక పాత్రలో కార్తికేయ!

నేచురల్ స్టార్ నాని, క్రేజీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో భారీ చిత్రానికి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రాన్ని ప్రారంభించారు. జెర్సీ తర్వాత నాని నటించబోతున్న చిత్రం ఇదే. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పూజ కార్యక్రమాలతో సోమవారం ఉందయం ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

Nani and Vikram Kumars crazy project launched

ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అతిథిగా హాజరయ్యారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కీలక పాత్రలో నటించబోతున్నాడు. దీని గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మూవీ లాంచ్ లో నాని పక్కనే కార్తికేయ కూడా కనిపించడంతో అతడు కూడా ఈ చిత్రంలో భాగమనే విషయం ఖరారైంది. పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

Nani and Vikram Kumars crazy project launched

ఇక నాని, విక్రమ్ కుమార్ తొలి కాంబోలో వచ్చే ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. నాని సరసన ఈ చిత్రంలో 5గురు హీరోయిన్లు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. చిత్ర నేపథ్యం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. నాని నటిస్తున్న జెర్సీ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X