నిర్మాతగా నాని మరో హిట్.. వైరల్‌గా మారిన హిట్ ఫస్ట్ గ్లింప్స్
ఈ మధ్య టాలీవుడ్‌లో ట్రెండ్ మారుతోంది. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. మరి కొందరు తమ సినిమాలను తామే నిర్మించుకుంటుంటే.. ఇంకొంత మంది రచయితలుగా మారి కథలు కూడా రాసేస్తున్నారు. ఈ క్రమంలో నాని నిర్మాతగా జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోగా.. విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్ చిత్రంతో నిర్మాతగా, హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. వీరిద్దరు కలిసి రాబోతోన్న హిట్ చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చేసింది.

తక్కువ బడ్జెట్‌లో..
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ క్వాలిటీ విత్ కంటెంట్ రావాలని హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వినూత్న కాన్సెప్ట్‌తో తక్కువ బడ్జెట్‌లో అ! చిత్రాన్ని తెరకెక్కించి నేషనల్ అవార్డు రేసులో విజయం సాధించాడు. బెస్ట్ మేకప్ మ్యాన్ కేటగిరీలో అవార్డు అందుకున్నారు. మళ్లీ అదే బాటలో విజయం సాధించేందుకు విశ్వక్ సేన్‌ను హీరోగా పెట్టి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

వైరల్‌గా మారిన టైటిల్..
హిట్ అంటూ టైటిల్ పెట్టి.. హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నాడు నాని. నిర్మాతగా రెండో విజయాన్ని అందుకునేందుకు నాని సిద్దంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త ఏడాది కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది చిత్రయూనిట్. టైటిల్‌తోనే హైప్ పెంచిన చిత్రయూనిట్.. ఫస్ట్ గ్లింప్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది.
వైరల్‌గా మారిన ఫస్ట్ గ్లింప్స్..
ఇందులో విశ్వక్ ఓ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తన వృత్తిలో భాగంగా ఎదురైన మొదటి కేసును చేదించేందుకు చేసే ప్రయత్నమే హిట్ అని తెలుస్తోంది. ఆ ప్రయాణంలో తనకు ఎదురైన ప్రమాదాలేంటి? ఆ కేసుని ఎలా ఛేదించాడు? అనే విషయాల నేపథ్యంగా ఈ సినిమా సాగబోతోన్నట్లు ఫస్ట్ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

త్వరలో టీజర్..
ఈ మూవీ టీజర్ కూడా త్వరలోనే విడుదల కాబోతోందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శౌలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











