twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దళపతి విజయ్ ‘మాస్టర్’లో నాని: నిర్మాతలు అలా ఫిక్స్ అవడంతో మారింది

    |

    కోలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో ఇళయదళపతి విజయ్ ఒకడు. విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు.. వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే దక్షిణాది భాషలన్నింటిలోనూ మార్కెట్‌ను పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్య విజయాల పరంపరతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ హీరో... ప్రస్తుతం 'ఖైదీ' ఫేం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'మాస్టర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీంతో ఈ మూవీపై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న 'మాస్టర్'ను దర్శకుడు లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విజయ్‌ను ఢీకొట్టే నెగటివ్ పాత్రను మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి చేస్తున్నాడు. వాస్తవానికి ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ ముందుగా నేచురల్ స్టార్ నాని పేరును పరిశీలించిందట. ఆ తర్వాత మాధవన్‌ను కూడా అనుకున్నారని తెలిసింది. కాకపోతే విజయ్ సేతుపతి ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపడంతో వాళ్లిద్దరినీ కాదని, ఆయననే ఫిక్స్ చేశారట దర్శక నిర్మాతలు. ఇలా ఓ భారీ సినిమాలో భాగం అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు.

    అందంతో అదరగొడుతున్న బాలీవుడ్ హీరోయిన్.. అతి ఖరీదైన బ్యాగ్‌తో

    Nani was First Choice for Master Movie

    సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీని విడుదల కాబోతున్న 'మాస్టర్'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగా కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. తద్వారా 2020లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోగా ఇది రికార్డులకెక్కింది. తెలుగు ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇక, ఈ సినిమాలో మాలవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    Master is an upcoming Indian Tamil-language action-thriller film written and directed by Lokesh Kanagaraj, and produced by Xavier Britto, under the banner XB Film Creators. The film stars Vijay and Vijay Sethupathi, with Malavika Mohanan, Arjun Das, Andrea Jeremiah and Shanthanu Bhagyaraj in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X