హీరోయిన్ ప్రియాంక మోహన్ గ్యాంగ్ లీడర్‌కు ముందు ఏం చేసేదంటే?
హీరోయిన్ ప్రియాంక మోహన్ గ్యాంగ్ లీడర్‌కు ముందు ఏం చేసేదంటే
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. టీజర్, ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌తో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ -
''నేను ఒక ఫ్యాషనేట్ థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఒక షార్ట్ ఫిలిమ్ చేశాను. అలాగే ఒక మూవీలో నటించాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన విక్రమ్ సర్‌కి అలాగే నాని గారికి థాంక్స్, మైత్రి మూవీస్ వారు నన్ను వాళ్ళింటి అమ్మాయిలా చూసుకున్నారు. అలాగే నా కో యాక్టర్స్ లక్ష్మి, శరణ్య, కార్తికేయ గారికి స్పెషల్ థాంక్స్. ఇది మీ అందరి 'గ్యాంగ్‌లీడర్'. అందరూ థియేటర్స్‌లో సినిమా చూడండి అని అన్నారు. గ్యాంగ్ లీడర్ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ అవబోతుంది. మేకింగ్ అంతా చాలా ఫన్నీగా సాగింది. తప్పకుండా సినిమా చూడండి'' అన్నారు.

నటీనటులు, సాంకేతికవర్గం
నేచురల్ స్టార్ నాని, RX100 ఫేమ్ కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం),
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్
సంగీతం: అనిరుధ్ రవిచందర్,
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్,
మాటలు: వెంకీ,
రచనా సహకారం: ముకుంద్ పాండే,
పొడక్షన్ డిజైనర్: రాజీవన్,
ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్,
ఎడిటింగ్: నవీన్ నూలి,
వి.ఎఫ్.ఎక్స్.: మకుట,
కాస్ట్యూమ్ డిజైనర్: ఉత్తర మీనన్,
స్టిల్స్: జి.నారాయణరావు,
కో-డైరెక్టర్: కె.సదాశివరావు,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శేషు,
సీఈవో: చిరంజీవి (చెర్రీ),


Click it and Unblock the Notifications











