twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడు భాషల్లో నాని సినిమా రీమేక్: ఇక్కడ ఆడకున్నా అందుకే చేస్తున్నారట

    |

    ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకున్నా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. నేచురల్ యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు నాని. సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చుకుంటోన్న అతడు.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం 'గ్యాంగ్ లీడర్' అనే రీవేంజ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కలెక్షన్ల పరంగా ఇది నిరాశనే మిగిల్చింది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాను పలు భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు.

    ఓ వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు కొందరు ఎదురు చూస్తుండడం.. వాళ్లకు హీరో లీడర్‌గా మారడం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రమే 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించాడు. పాత కథే అయినా కొత్త ట్విస్టులతో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఇటీవలే దర్శకుడు విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తెలుగులో అంతగా ఆడకపోయినా.. ఈ సినిమా కాన్సెప్టు నచ్చడం వల్లే ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారని ఆయన స్వయంగా పేర్కొనడం విశేషం.

    Nanis Gang Leader Remake in Three languages

    ఆ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ.. 'గ్యాంగ్ లీడర్‌కు ముందు ఈ కథ నా భార్యకు చెప్పా. ఎందుకంటే ఆమెనే నాకు పెద్ద విమర్శకురాలు. ఆమెకు ఎంతగానో నచ్చింది. అందుకే దీన్ని నానికి చెప్పాను. ఆయన వెంటనే ఒప్పుకోవడంతో పట్టాలెక్కించేశా. కానీ, ఇలాంటి ఫలితం వస్తుందనుకోలేదు' అని చెప్పుకొచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు.

    English summary
    Tollywood Young Hero Natural Star Nani Did a Gang Leader Movie Few Years back. Vikram Kumar Directed This Movie. Now This Movie Remaking in Three languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X