Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మూడు భాషల్లో నాని సినిమా రీమేక్: ఇక్కడ ఆడకున్నా అందుకే చేస్తున్నారట
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకున్నా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. నేచురల్ యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు నాని. సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చుకుంటోన్న అతడు.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం 'గ్యాంగ్ లీడర్' అనే రీవేంజ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కలెక్షన్ల పరంగా ఇది నిరాశనే మిగిల్చింది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాను పలు భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు.
ఓ వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు కొందరు ఎదురు చూస్తుండడం.. వాళ్లకు హీరో లీడర్‌గా మారడం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రమే 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించాడు. పాత కథే అయినా కొత్త ట్విస్టులతో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఇటీవలే దర్శకుడు విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తెలుగులో అంతగా ఆడకపోయినా.. ఈ సినిమా కాన్సెప్టు నచ్చడం వల్లే ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారని ఆయన స్వయంగా పేర్కొనడం విశేషం.
ఆ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ.. 'గ్యాంగ్ లీడర్‌కు ముందు ఈ కథ నా భార్యకు చెప్పా. ఎందుకంటే ఆమెనే నాకు పెద్ద విమర్శకురాలు. ఆమెకు ఎంతగానో నచ్చింది. అందుకే దీన్ని నానికి చెప్పాను. ఆయన వెంటనే ఒప్పుకోవడంతో పట్టాలెక్కించేశా. కానీ, ఇలాంటి ఫలితం వస్తుందనుకోలేదు' అని చెప్పుకొచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు.